Friday, April 10, 2009

అంత్యాక్షరీ

ఎక్కడో చదివా - వాళ్లు మహమ్మద్ రఫి - కిషోర్ కుమార్ అంత్యాక్షరీ ఆడుతున్నారు. అంటే, ఓ రఫీ పాట - దాని అంత్యాక్షరంతో ఓ కిషోర్ పాట. మనమూ మొదలు పెడదామా?
ఓ ఘంటసాల పాట - అంత్యాక్షరంతో ఓ యస్.పి.బి పాట.
ప్రతీ పాటకీ తప్పనిసరిగా ఇవి ఉండాలి: పాడినవారు, ఏ చిత్రం, రాసింది ఎవరు, సంగీతం ఎవరు, మొట్టమొదటి చరణం (ఒకవేళ్ల పాటకి ముందు ఇంట్రో ఉంటే అంత్యాక్షరం దానితో మొదలుకావాలి).

తొందర్లో ఇక్కడ చేరిన పాటల ఆడియోలు సేకరించి అందిస్తా.

180 comments:

  1. వాబ్బా :)
    కానీయ్ మరి

    ReplyDelete
  2. ఇంకెందుకాలశ్యం. మొదలు పెట్టండి.

    ReplyDelete
  3. చిత్రం: భూకైలాస్పాడినవారు : ఘంటసాల
    రాసినవారు : సముద్రాల
    సంగీతం : సుదర్శనం ఆర్.
    దేవ దేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో
    దైవత లోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమోనమో
    దేవ దేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో
    దైవత లోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమోనమో
    పాలితకింకర భవనా శంకర శంకరపురహర నమోనమో
    పాలితకింకర భవనా శంకర శంకరపురహర నమోనమో
    హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో
    హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో
    దేవ దేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో
    దైవత లోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమో నమో
    దురిత విమోచన ఫాలొవిలోచన పరమదయాకర నమో నమో
    కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో
    కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో
    దేవ దేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో
    దైవత లోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమో నమో
    నమో నమో నమో నమో నమో నమో
    నారయణ హరి నమో నమో నారయణ హరి నమో నమో
    నారయణ హరి నమో నమో నారయణ హరి నమో నమో
    నారద హ్రుదయ విహారి నమో నమో నారద హ్రుదయ విహారి నమో నమో
    నారయణ హరి నమో నమో నారయణ హరి నమో నమో
    నారయణ హరి నమో నమో నారయణ హరి నమో నమో
    పంకజనయనా పన్నగ శయనా
    పంకజనయనా పన్నగ శయనా
    శంకర వినుతా నమో నమో
    శంకర వినుతా నమో నమో
    నారయణ హరి నమో నమో నారయణ హరి నారయణ హరి నారయణ హరి నమో నమో

    చివరి అక్షరం "మ"

    ReplyDelete
  4. "మనసున మనసై...."

    డాక్టర్ చక్రవర్తి
    ఘంటసాల
    ర-సాలూరు రాజేశ్వర రావు

    ReplyDelete
  5. యోగి బాబు: ఘంటసాల గారి పాటకి యస్.పి.బి పాటమ్మా.

    ReplyDelete
  6. కనీసం మొదటి చరణం చెప్పాలమ్మా.

    ReplyDelete
  7. సినిమా పేరు: శీతకొకచిలుక (1983)
    పాడినవారు: బాలసుబ్రహ్మణ్యం, శైలజ

    మాటే మంత్రము మనసే బంధము
    ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
    ఇది కళ్యాణం కమనీయం జీవితం
    మాటే మంత్రము మనసే బంధము
    ఈ మమతే ఈ సమతే మంగళ వాద్యము
    ఇది కళ్యాణం కమనీయం జీవితం

    నీవే నాలో స్పందించినా
    ఈ ప్రియ లయలో శృతి కలిసే ప్రాణమిదే
    నేనే నీవుగా పువ్వు తావిగా
    సమ్యోగాల సంగీతాలు విరిసే వేళలో

    నేనే నీవై ప్రేమించినా
    ఈ అనురాగం పలికించే పల్లవివే
    ఎద నా కోవెలా యెదుటే దేవతా
    వలపై వచ్చి వరమే ఇచ్చి కలిసే వేళలో

    ReplyDelete
  8. *శీతకొకచిలుక
    సీతాకోకచిలుక

    ReplyDelete
  9. సినిమా పేరు:మాయా బజార్(1957)
    పాడినవారు: ఘంటసాల వెంకటీశ్వర రావు,సుశీల

    లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో జగమే ఊగేనుగ తూగెనుగా

    ReplyDelete
  10. భాస్కర్, ఇంట్రోకి చీటీలేమైనా వున్నాయా ( ఆంటే, పాడినవారు,చిత్రం,సంగీతం తెలియదు)

    గౌరమ్మా,నీ మొగుడెవరమ్మా?
    ఎవరమ్మా వాడెవరమ్మా?

    చీటీలు లేకపొతే ఎక్జాం రేపటిదాకా బాయ్కాట్ చేస్తున్నా...

    ReplyDelete
  11. గౌరమ్మా నీ మొగుడెవరమ్మా పాదింది కీ|శే| ఘంటసాల, మరియూ పి.సుశీల. రాసిన వారు శ్రీ ఆత్రేయ, సంగీతం కె.వి. మహాదేవన్, చిత్రం మూగమనసులు

    ReplyDelete
  12. చిత్రం: ప్రియమయిన నీకు
    పాడిన వారు: చిత్ర
    రాసిన వారు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
    సంగీతం: ఎస్.ఏ.రాజ్ కుమార్

    మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు రావే ఎలా
    మాటున ఉన్నది ఓ మంచి సంగతి బయటికి రాదే ఎలా
    అతడిని చూస్తే రెప్పలు వాలిపోయే బిడియం ఆపేదెలా
    యెదురుగ వస్తె చెప్పక ఆగిపోయే తలపులు చూపేదెలా
    ఒక్కసారి దరి చేరి యెద గొడవేమిటో తెలపకపోతె ఎలా

    ReplyDelete
  13. చిత్రం: ఇంద్రుడు చంద్రుడు
    సంగీతం: ఇళయరాజా
    పాడినవారు: బాలు

    లాలిజో లాలీజో
    ఊరుకో పాపాయి
    పారిపోనీకుండా
    పట్టుకో నా చేయి

    ReplyDelete
  14. యమునాతటి లో నల్లనయ్య కై వేచి చీచెనే రాధా
    రేయి గడిచెను పగలు గడిచెను మాధవుండు రాలేదు..

    యదు కుమారుడే లేని వేళలో..
    వెతలు రగిలెనె(?) రాధ గుండేలో..
    పాపం... రాధా...

    చిత్రం: దళపతి
    పాడినది: స్వర్ణలత
    సంగీతం: నాదయోగి ఇళయరాజా

    ReplyDelete
  15. "వేచి చూచెనే" -- అని చదువుకొనగలరు :)

    ReplyDelete
  16. ఓహ్.. ఈ సారి ఘంటసాల వంతు కదూ..

    యమునా తీరమున సంధ్యా సమయమున
    యమునా తీరమున సంధ్యా సమయమున
    వేయి కనులతో రాధ వేచి యున్నది కాదా!
    బాస చేసి రావేల మదన గోపాలా..!
    బాస చేసి రావేల మదన గోపాలా..!
    నీవు లేని జీవితము తావి లేని పూవు కదా

    యమునా తీరమున సంధ్యా సమయమున
    యమునా తీరమున సంధ్యా సమయమున
    వేయి కనులతో రాధ వేచి యున్నది కాదా!
    యమునా తీరమునా.....

    పూపొదలో దాగనేల పో పోరా సామి
    ఇంతసేపు ఏ ఇంతికి వంత పాడినావో
    దాని చెంతకె పోరాదో

    రానంత సేపు విరహమా
    నేను రాగానే కలహమా
    రాగానే కలహమా
    నీ మేన సరసాల చిన్నెలు
    అవి ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ
    ఏ కొమ్మ కొనగోటి ఆనవాలూ
    దోబూచులాడితి నీతోనే
    ఇవి ఈ కొమ్మ గురుతులు కాబోలు
    ఈ కొమ్మ గురుతులు కాబోలు
    నేను నమ్మనులే
    నేను నమ్మనులే నీ మాటలు
    అవి కమ్మని పన్నీటి మూటలు
    నా మాట నమ్మవే రాధికా
    ఈ మాధవుడు నీ వాడే గా
    రాధికా.....మాధవా.........
    చిత్రం: జయభేరి
    గాత్రం : ఘంటసాల
    సంగీతం : పెండ్యాల
    రచన : ఆరుద్ర

    ReplyDelete
  17. భవాని గారు - పప్పులో కాలేసారు. ఘంటసాలగారి పాటకి బాలు పాట, బాలు పాట చివరితో ఘంటసాల గారి పాట. నాయనా యోగేశ్, నువ్వుకూడా అగ్నిగుండంలో కాలేసావ్. నువ్వు చెప్పిన పాటలో అటు ఘంటసాల గారు కానీ ఇటు బాలూ కానీ లేరు :)

    ReplyDelete
  18. ఒరె ఒరె! మీటింగుకు వెళ్ళి వచ్చేప్పటికి చానా మారిందే ! అయినా ఈ రోజు నేను ఎక్జాం రాయను. one day batting ఇంకా చెయ్యలేదు.

    ReplyDelete
  19. చిత్రం - ఇద్దరూ ఇద్దరే
    రచన - ఆరుద్ర
    సంగీతం - చక్రవర్తి

    వళ్లంత వయ్యారమే పిల్లదాన ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదానా
    ఇవ్వాలనే ఉందిరా ఓ చిన్నవాడా ఎవ్వరైన చూస్తారురా ఓ వన్నెకాడా
    హరెరెరె వళ్లంత వయ్యారమే పిల్లదాన ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదానా
    అమ్మమ్మమ్మ ఇవ్వాలనే ఉందిరా ఓ చిన్నవాడా ఎవ్వరైన చూస్తారురా ఓ వన్నెకాడా
    హ ఊసులాడా అ చోటుకాదు
    అ చాటుఉంది అందాలతోటాలోన మందార చెట్టుకింద నా ముద్దు చెల్లించవే
    ఒ ఒ ఒ వళ్లంత వయ్యారమే పిల్లదాన ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదానా
    హ హ హ ఇవ్వాలనే ఉందిరా ఓ చిన్నవాడా ఎవ్వరైన చూస్తారురా ఓ వన్నెకాడా
    పువ్వల్లే నవ్వుతావు కౌవ్వించి కులుకుతావు
    కులుకంతా కూరవండి మనసారా తినిపించాలి హా ఓ
    రారానీ వేళలోనా రాజల్లేవస్తావూ ఏమేమో చేస్తావురా
    అబ్బబ్బబ్బ అందాలవాడలోన అద్దాల మేడలోన ఇద్దరమే ఉందామురా
    ఒ ఒ ఒ వళ్లంత వయ్యారమే పిల్లదాన ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదానా
    అయ్యయ్యయ్య ఇవ్వాలనే ఉందిరా ఓ చిన్నవాడా ఎవ్వరైన చూస్తారురా ఓ వన్నెకాడా
    ఓ మనసంతా మాలకట్టి మెడలోనా వేస్తాను
    మనువాడే రోజుదాకా ఓ రయ్యో ఆగలేవా ఓ
    అందాకా ఆగలేనే నావయసూ ఊరుకోదే
    అందాకా ఆగలేనే నావయసూ ఊరుకోదే
    వయ్యారి నన్నాపకే
    అమ్మమ్మమ్మ పనీటివాగుపక్క సంపంగి తోటలోన నీదాననౌతానురా
    ఒ ఒ ఒ వళ్లంత వయ్యారమే పిల్లదాన ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదానా
    అయ్యయ్యయ్య ఇవ్వాలనే ఉందిరా ఓ చిన్నవాడా ఎవ్వరైన చూస్తారురా ఓ వన్నెకాడా
    హ ఊసులాడా అ చోటుకాదు
    అ చాటుఉంది అందాలతోటాలోన మందార చెట్టుకింద నా ముద్దు చెల్లించవే
    ఒ ఒ ఒ వళ్లంత వయ్యారమే పిల్లదాన ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదానా
    హ హ హ ఇవ్వాలనే ఉందిరా ఓ చిన్నవాడా ఎవ్వరైన చూస్తారురా ఓ వన్నెకాడా

    ReplyDelete
  20. పాడినవారు రాయలేదు మీరు......

    ReplyDelete
  21. శ్రీ - అవును, మరచితిని. ఈ పాట, వళ్లంత వయ్యారమే పిల్లదాన ఒకచిన్న ముద్దియ్యవే ఓ కుర్రదానా -
    పాడినవారు బాలు, మరియూ సుశీల.

    ఐతే - శ్రీ గారు, మీరు అందించిన పాట, పాడిన వారు: చిత్ర. ఇక్కడ మీరు గోంగోర పప్పులో కాలు చెయ్యి వేసారు. బాలు, ఘంటసాల గారి గళం తప్పకుండా ఉంది తీరాలి కదా...

    ReplyDelete
  22. అవును, ఇపుడే కాళ్ళు కడుక్కుని వచ్చి టపా మళ్ళీ చదివాను.మీ బాలు పాటకి ఘంటసాల పాట అలోచించి రాస్తా.

    ReplyDelete
  23. భా.రా.రె - >>one day batting ఇంకా చెయ్యలేదు.
    బుర్ర గోక్కున్నా, ఉన్న నాలుగెంటృకలు సేతిలో సెయ్యేసి చెప్పినయ్యి. కానీ దీనీ భావం అర్ధమైతల్లే. అంటే ఏందో జర చెప్పరేదే?

    ReplyDelete
  24. నా వంత బాలు పాట
    నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి
    నా దాహం తీరనిది నీ హృదయం కరగనిది

    నేనొక ప్రేమ పిపాసిని....

    తలుపు మూసిన తలవాకిటిలో
    పగలు రేయి నిలుచున్నా
    పిలిచి పిలిచి బదులేరాక
    అలసి తిరిగి వెళుతున్నా

    నా దాహం తీరనిది నీ హృదయం కరగనిది
    నేనొక ప్రేమ పిపాసిని...

    పూట పూట నీ పూజ కోసమని
    పువ్వులు తెచ్చాను
    ప్రేమ భిక్షను పెట్టగలవని దోసిలి ఒగ్గాను
    నీ అడుగులకు మడుగులోట్టగా
    ఎడదను పరిచాను
    నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను

    నేనొక ప్రేమ పిపాసిని...

    పగటికి రేయి .. రేయికి పగలు.. పలికే వీడ్కోలు
    సెగ రేగిన గుండెకు చెబుతున్నా
    నీ చెవిన పడితే చాలునని
    నా జ్ఞాపకాల నీడలలో నన్నేపుడో చూస్తావు
    నను వలచావని తెలిసేలోగా నివురైపోతాను

    నేనొక ప్రేమ పిపాసిని...

    చిత్రం : ఇంద్ర ధనుస్సు
    గానం : ఎస్.ఫై.బాలసుబ్రహ్మణ్యం
    రచన : ఆత్రేయ
    సంగీతం : కే.వి.మహాదేవన్

    ReplyDelete
  25. జ్యోతి గారు :
    >>ఇవ్వాలనే ఉందిరా ఓ చిన్నవాడా ఎవ్వరైన చూస్తారురా ఓ వన్నెకాడా
    "డ" తో మొదలయ్యే ఘంటసాల గారి పాట.

    ReplyDelete
  26. "డ్" తో పాటల కోసం చాలా కష్ట పడ్డానండీ నిన్న. "ద" తో పాడమంటే నేను పాడుతా.

    ReplyDelete
  27. నాదీ సేం డైలాగ్

    ReplyDelete
  28. డబ్బు డబ్బు మాయదారి డబ్బు అనే ఓ పాట ఉంది, బందిపోటు భీమన్న అనే చిత్రం నుండి. పాడింది ఘంటసాల గారే. ఐతే ఆ పాట సాహిత్యం కానీ, ఆడియో కానీ ఎక్కడ లేదు..లేకపోతే ఏటిసేత్తావేటి, డ బదులు ద అనేస్కుందాం.
    ఏతంటారేటి జనాలు.

    ReplyDelete
  29. మామేంటంతాము. మీరేటంతే అదే అంతాము.

    ReplyDelete
  30. అలగలాగే...ఇహ సూస్కో...

    చిత్రం : వినాయక చవితి
    పాడినవారు: ఘంటసాల
    రాసినవారు: సముద్రాల సీనియర్
    సంగీతం: ఘంటసాల

    దినకరా దినకరా హే శుభకరా...
    దినకరా శుభకరా
    దేవాదీనాధారా,తిమిర సం హార (దినకరా)

    పతిత పావన మంగళ ధాతా పాప సంతాప లోకహిత
    ఆ...
    పతిత పావన మంగళ ధాతా పాప సంతాప లోకహిత

    బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా
    ఆ...
    బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా
    బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా
    ఆ...
    బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా
    బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా
    ఆ...
    ఆ...
    బ్రహ్మ విష్ణు పరమేశ్వర రూపా వివిద వేద విహ్న్యన నిధానా
    వినతలోక పరిపాలక భాస్కర దినకరా శుభకరా
    ధేవా దీనాధార, తిమిర సంహార
    దినకరా... హే..దినకరా...ప్రభో
    దినకరా శుభకరా.....

    ReplyDelete
  31. చిత్రం - శ్రీదేవి
    పాట - రాసాను ప్రేమలేఖలెన్నో
    పాడినవారు - బాలు, సుశీల
    సంగీతం - జి.కె. వెంకటేశ్
    రచన - దాశరధి.

    రాసాను ప్రేమలేఖలెన్నో
    దాచాను ఆశలన్ని నీలో
    భువిలోన మల్లియలాయె
    దివిలోన తారకలాయె నీ నవ్వులే
    రాసాను ప్రేమలేఖలెన్నో
    దాచాను ఆశలన్ని నీలో
    భువిలోన మల్లియలాయె
    దివిలోన తారకలాయె
    నీ నవ్వులే

    కొమ్మల్లో కోయిలమ్మ కో యన్నదీ
    కొమ్మల్లో కోయిలమ్మ కో యన్నదీ
    నా మనసు నిన్నే తలచి ఓ యన్నదీ
    మురిపించే ముద్దు గులాబి మొగ్గేసిందీ
    చిన్నారి చెక్కిలికేమో సిగ్గేసింది

    రాసాను ప్రేమలేఖలెన్నో
    దాచాను ఆశలన్ని నీలో
    భువిలోన మల్లియలాయె
    దివిలోన తారకలాయె నీ నవ్వులే

    నీ అడుగుల సవ్వడి ఉందీ నా గుండెలో
    నీ చల్లని రూపం ఉందీ నా కనులలో
    నాలోని సోయగమంతా విరబూసెలే
    నాలోని సోయగమంతా విరబూసెలే
    మనకోసం స్వర్గాలన్నీ దిగివచ్చెనులే

    రాసాను ప్రేమలేఖలెన్నో
    దాచాను ఆశలన్ని నీలో
    భువిలోన మల్లియలాయె
    దివిలోన తారకలాయె నీ నవ్వులే

    అందాల పయ్యెద నేనై ఆటాడనా
    కురులందు కుసుమం నేనై చెలరేగనా
    నీ చేతుల వీణని నేనై పాట పాడనా
    నీ పెదవుల గుసగుస నేనై పొంగిపోదునా

    రాసాను ప్రేమలేఖలెన్నో
    దాచాను ఆశలన్ని నీలో....

    ReplyDelete
  32. చిత్రం - గుండమ్మ కథ
    పాడినవారు - ఘంటసాల
    సంగీతం - ఘంటసాల
    రచన - పింగళి నాగేంద్ర రావు


    లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం
    దద్దరిల్లింది పురుషప్రపంచం, లేచింది మహిళాలోకం

    ఎపుడో చెప్పెను వేమనగారు, అపుడే చెప్పెను బ్రహ్మంగారు (2)
    ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా, ఆ . . .
    ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మ విస్సన్న చెప్పిన వేదం కూడా
    లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం

    పల్లెటూళ్ళలో పంచాయితీలు, పట్టణాలలో ఉద్యోగాలు (2)
    అది ఇది ఏమని అన్ని రంగములా, ఆ . . .
    అది ఇది ఏమని అన్ని రంగముల
    మగధీరుల నెదిరించారు, నిరుద్యోగులను పెంచారూ
    లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం

    చట్టసభలలో సీట్ల కోసం, భర్తలతోనే పోటీ చెసీ (2)
    ఢిల్లీ సభలో పీఠం వేసీ, ఈ . . .
    ఢిల్లీ సభలో పీఠం వేసి
    లెక్చరులెన్నో దంచారు, విడాకు చట్టం తెచ్చారూ
    లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం
    దద్దరిల్లింది పురుష ప్రపంచం
    లేచింది, నిద్ర లేచింది, నిద్ర లేచింది మహిళాలోకం

    ReplyDelete
  33. మహిళలోలకం, క్షమించాలి (:):) మహిళాలోకం అంటే "మ"తో పూర్తైనట్టా గుర్గారూ?

    ReplyDelete
  34. కం అంటే "క" తో పాడచ్చు.

    ReplyDelete
  35. చిత్రం: స్వాతిముత్యం
    పాడినవారు: బాలు, జానకి
    రాసినవారు: సిరివెన్నెల సీతారామశాస్త్రి
    సంగీతం: ఇళయరాజా

    మనసు పలికే "2"
    మౌన గీతం "2"
    మనసు పల్లికే మౌన గీతం నీవే
    మమతలోలికే "2"
    స్వాతిముత్యం "2"
    మమతలోలికే స్వాతిముత్యం నీవే
    అణువు అణువు ప్రణయ మధువు "2"
    తనువు సుమధనువు

    ReplyDelete
  36. చిత్రం - అందమే ఆనందం
    సంగీతం - సత్యం
    సాహిత్యం - వేటూరి
    పాడినవారు - బాలు

    మధుమాస వేళలో మరుమల్లె తోటలో
    మధుమాస వేళలో మరుమల్లె తోటలో
    మనసైన చిన్నదీ లేదేలనో
    మధుమాస వేళలో మరుమల్లె తోటలో

    ఆడింది పూలకొమ్మ పాడింది కోయిలమ్మా
    అనురాగ మందిరంలో కనరాదు పైడిబొమ్మ
    ప్రణయాలు పొంగేవేళా ప్రణయాలు పొంగేవేళా
    నాలో రగిలే ఏదో జ్వాలా
    మధుమాస వేళలో మరుమల్లె తోటలో
    మనసైన చిన్నదీ లేదేలనో

    ఉదయించె భానుదీపం వికసించలేదు కమలం
    నెలరాజు వ్రాతకోసం లేచింది కన్నెకుముదం
    వలచింది వేదనకేనా వలచింది వేదనకేనా
    జీవితమంతా దూరాలేనా

    మధుమాస వేళలో మరుమల్లె తోటలో
    మనసైన చిన్నదీ లేదేలనో
    మధుమాస వేళలో మరుమల్లె తోటలో

    ReplyDelete
  37. భవానీ గారి పాట చివరి అక్షరం -
    తనువు సుమధను"వు"
    నా పాట చివరి అక్షరం -
    మరుమల్లె తోట"లో"

    ఆమె నా కన్నా ముందు పోష్టు చేసారు కాబట్టి "వ" తో మొదలైయ్యే ఘంటసాల గారి పాట ఏస్కోండి ఎవ్వరైనా...

    శ్రీ భాయ్ - "మ" అనేస్కున్నాం భాయి. నువ్వు అభయంతరం తెలిపితే "క" ని లెక్కలోకి తీస్కుని ఓ రికార్డేస్కుంటాం.

    ReplyDelete
  38. మాకీ హేం పర్వా లేదు హై...

    వ..తో పాట పాడుతా హై..

    ReplyDelete
  39. చిత్రం - బంగారు గాజులు
    సంగీతం - టీ.చలపతి రావు
    సాహిత్యం - దాశరధి
    పాడినవారు - ఘంటసాల

    విన్నవించుకోనా చిన్న కోరిక
    ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక (విన్న)

    నల్లని నీ కురులలో
    తెలతెల తెల్లని సిరిమల్లెనై (2)
    పరిమళాలు చిలుకుతూ నే పరవశించి పోనా (విన్న)

    వెచ్చని కౌగిట పవళించిన వీణనై (2)
    రాగమే అనురాగమై నీ మనసు నిండిపోనా (విన్న)

    తీయని నీ పెదవిపై చెలరేగిన ఒక పాటనై (2)
    అందరాని నీలి నింగి అంచులందుకోనా (విన్న)

    చల్లని నీ చూపులే చెలివెన్నెలై విరబూయగా
    కలువనై నీ చెలియనై నీ కన్నులందు వెలిగేనా (విన్న)

    ReplyDelete
  40. చిత్రం - అన్నదమ్ముల సవ్వాల్
    సంగీతం - సత్యం
    సాహిత్యం - చి.నా.రె
    గళం - బాలు
    (హే)నాకోసమే నీవున్నదీ దీ దీ
    ఆకాశమే అవునన్నదీ దీ దీ
    మౌనం వద్దూ ఓ మాటైన ముద్దూ హేయ్ మతిపోతున్నదీ
    నాకోసమే నీవున్నదీ దీ దీ
    ఆకాశమే అవునన్నదీ దీ దీ
    మౌనం వద్దూ ఓ మాటైన ముద్దూ హేయ్ మతిపోతున్నదీ
    హూ!!!
    హహ్హా !! అడుగు వెయ్యకూ రాజహంసలే అదిరిపోయేనులే
    తిరిగి చూడకు పడుచుగుండెలే చెదిరిపోయేనులే హాహాహా
    అడుగు వెయ్యకూ రాజహంసలే అదిరిపోయేనులే
    తిరిగి చూడకు పడుచుగుండెలే చెదిరిపోయేనులే
    వెచ్చని కోరిక నాలో మెరిసి విసిరేస్తున్నదీఈఈఈ
    నాకోసమే నీవున్నదీ దీ దీ
    ఆకాశమే అవునన్నదీ దీ దీ
    మౌనం వద్దూ ఓ మాటైన ముద్దూ హేయ్ మతిపోతున్నదీఈఈఈ
    హూ!!!!
    మొదట చూపిన మూతివిరుపులు తుదకు ఏమాయలే హే
    అలక తొనకగా చినుకు చినుకుగా వలపు జల్లాయలే హేహేహే
    మొదట చూపిన మూతివిరుపులు తుదకు ఏమాయలే
    అలక తొనకగా చినుకు చినుకుగా వలపు జల్లాయలే
    ఆ జల్లుల తడిసిన అల్లరి వయసే జతనీవన్నదీఈఈఈ హా!!!!
    నాకోసమే నీవున్నదీ దీ దీ
    ఆకాశమే అవునన్నదీ దీ దీ
    మౌనం వద్దూ ఓ మాటైన ముద్దూ హేయ్ మతిపోతున్నదీఈఈఈ
    హహహా!!!!

    చివరి అక్షరం - "ద" అనికోవచ్చు.
    అలానే ఈ పాట హె తో మొదలౌతున్నా పాటలో ఎక్కడా ఆ అక్షరంతో మొదటి చరణాలు రిపీట్ కావు కనక "న" తో మొదలైయ్యిందీ అనుకున్నా.
    అభ్యంతరం ఐతే చెప్పండి.

    ReplyDelete
  41. చిత్రం -రోజా
    సంగీతం -ఏ .ఆర్.రహ్మాన్
    గానం -బాలు
    నా చెలి రోజావే
    నాలో వున్నావే
    నిన్నే తలచెదనే నేనే
    కళ్ళల్లో నీవే ,కను మూస్తే నేవే
    కన్నీట నీవే,ఎదలో నిండెనే
    కనిపించవో , అందించవో తోడు .....

    ReplyDelete
  42. చిత్రం: సంకీర్తనా
    పాడినవారు: బాలు, జానకి
    సంగీతం: ఇళయరాజ


    కలికి మేనిలో కలిగే స్పందనం "2"
    ఇలకూ వెన్నెలకూ "2"
    జరిగే సంగమం
    "కలికి"

    రంగుల కలగా మెరిసే ఆకాశం
    ముంగిట తానే నిలిచే
    తోటకు వరమై దొరికే మధుమాసం
    గూటిని తానే వలచే
    గర్భ గుడిని దాటి కదిలింది దేవతా
    చేయి అందుకొమ్మని చేరుకుంది నీ జత
    "కలికి"

    పెదవుల వలలో పెరిగే ఏకాంతం
    ప్రేమకు పేరై ఎగిసే
    తలపుల వడిలో ఒదిగే అనురాగం
    తలుపులు తానే తెరిచే
    తల్లి నేల వేసే మన పెళ్ళి పందిరి"2"
    వేయి జన్మలెత్తినా వీడదు మన కౌగిలి
    "కలికి"

    ReplyDelete
  43. స్రీ గారు పెట్టిన పాటకు చివరి అక్షరం "క".
    అందుకే ఈ పాట పోస్ట్ చేశాను.

    ReplyDelete
  44. తాటతీసారు భవానీ గారు. మంచి స్పందన. నేనూ క మీద ఒకటి రాద్దాం అనుకున్నా.
    ఇప్పుడు కిం కర్తవ్యం? చిన్నీ గారి కన్నా ముందు నేను పోష్టు చేసా కాబట్టి నాదే తీస్కోవాలి (నా డిమ్యాండు)
    అలాకాదు, భవానీ మేడం పాట తీస్కుంటాం అంటే ఆట్టానే..ఏదైనా సవాల్ :):)

    ReplyDelete
  45. నేను చాలాసేపటి నుండీ "ద" మీద పాట రాస్తునే ఉన్నాను. ఇలా సర్దుకు పోదాము రండి...

    చిత్రం - దేవుడు చేసిన మనుషులు
    సంగీతం - రమేష్ నాయుడు
    సాహిత్యం - శ్రీ శ్రీ
    పాడినవారు - ఘంటసాల

    దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా
    వినండి మనుషుల గోల, కనండి దేవుడి లీల

    దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా
    వినండి మనుషుల గోల, కనండి దేవుడి లీల

    గోవిందా హరి గోవిందా, గోవిందా భజ గోవిందా
    గోవిందా గోవిందా హరి గోవిందా, గోవిందా గోవిందా భజ గోవిందా

    ReplyDelete
  46. చిత్రం : నిర్ణయం
    గానం : బాలు
    సంగీతం : ఇళయ రాజ
    పాట: హలో గురు ప్రేమ కొస మే రోయ్ జీవితం .
    మగాడితో , ఆడదానికేలా పౌరుషం .
    ప్రేమించాను దీన్నే . కాదంటోంది నన్నే
    మహా మహా సుందరాంగులే పొందలేని వాణ్ణి .
    'హ ' తో అందు కున్న పాట ఇది .

    ReplyDelete
  47. సినిమా : పూజాఫలం

    సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
    గాయకులు : ఘంటసాల

    నిన్నలేని అందమేదో నిదుర లేచెనెందుకో
    నిదుర లేచెనెందుకో
    తెలియని రాగమేదో తీగసాగెనెందుకో
    తీగసాగెనెందుకో
    నాలో ....... (నిన్నలేని అందమేదో)

    పూచిన ప్రతి తరువొక వధువు పువుపువ్వున పొంగెను మధువు
    ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో
    (నిన్నలేని అందమేదో)
    తెలినురుగులె నవ్వులు కాగా సెలయేరులు కులుకుతు రాగా
    కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే
    (నిన్నలేని అందమేదో)

    పసిడి అంచు పైటజార పయనించె మేఘబాల
    అరుణకాంతి సోకగానే పరవశించెనే
    (నిన్నలేని అందమేదో)

    చివరి అక్షరం "ద"

    ReplyDelete
  48. భా.రా.రె - వచ్చావా, ఈయ్యాల బ్యాటింగు చేయ్యొచ్చా? తస్సదియ్యా. సరే..."ద" .. సూద్దాం, ఔత్సాహికులు ఎవరైనా ముందుకొస్తారేమో...వాళ్ల పాటతో...

    ReplyDelete
  49. సినిమా: సంకీర్తన
    పాడినవారు: బాలు
    సంగీతం: ఇళయరాజా


    దేవీ దుర్గాదేవీ "2"
    ఆంగికం వాచికం అన్ని నీవే
    అఖిలాత్మ నీవే "2"
    ఆంగికం వాచికం అన్ని నీవే
    అఖిలాత్మ నీవే "2"
    దేవీ దుర్గాదేవీ "2"
    దేవీ

    కాల భయకర శూలి ప్రియకర
    మూల మాతృత్వమే "2"
    రాగ సుందర రౌద్ర భందుర
    యోగలోచనివే
    జరుపవేమి మనుజ మహిష మర్ధన
    నెరపవేమి సామ్య ధర్మ రక్షణ
    తాప వారిణి పాప హారిణి
    అనంత దిగంత దృగంత చారిణి


    దేవీ కవితాదేవీ"2"
    ధ్యానమూ, గానమూ అన్ని నీవే
    నన్నంటి రావే"2"
    ధ్యానమూ, గానమూ అన్ని నీవే
    నన్నంటి రావే"2"
    "దేవీ"

    వాలుకనుగవలోనా మరుని ఆన విరుల వాన
    సంచాలిత సంచారిత పదాలు
    సాందీకృత చాంద్రీమయ నదాలు
    అనితరములు అభినయ విలాసములు
    పాల నవ్వులలోన భావన పైట సవరించే
    తీగ నడుముల సోగ బిడియము తూగి నటియించే
    అందుకుంటే తీపి బెదురు అల్లన
    అందకుంటే గుండె గుబురు జల్లన
    ఎంత విరహం ఎంత మధురం
    వెన్నెల్లో దూపాలు కళ్ళల్లో దీపాలు
    "దేవీ"

    పై పాటలో తప్పులు కనిపిస్తే క్షమించగలరు.

    ReplyDelete
  50. చిత్రం - గుండమ్మ కథ
    సంగీతం, గానం - ఘంటసాల
    వేషము మార్చెను.. భాషను మార్చెను
    మోసము నేర్చెను.. అసలు.. తానే మారెను.
    అయినా.. మనిషి మారలేదు.. ఆతని మమత తీరలేదు.

    ReplyDelete
  51. మంగమ్మ గారి మనవడు, కెవి మహదేవన్, సి నారాయణరెడ్డి,బాలు
    ( కోరస్ లేదు )

    దంచవే మేనత్త కూతురా
    వడ్లు దంచవే నా గుండెలదరా
    దంచు దంచు, బాగా దంచు
    దంచు దంచు, బాగా దంచు

    ఆ.. దంచు దంచు, బాగా దంచు, హా

    ReplyDelete
  52. చిత్రం: లాయర్ సుహాసిని
    సంగీతం: బాలు
    పాడినవారు: బాలు


    దివిని తిరుగు మెరుపు లలన
    సామజవరగమన
    కరుణ కరిగి భువికి దిగెన
    సామజవరగమన
    బ్రతుకు వెలిగె తరుణి వలన
    సామజవరగమన
    చెలిమి కలిమి మరువ గలన
    సామజవరగమన {2}


    అరవిరిసిన చిరునగవుల
    సామజవరగమన
    ఇలకురిసెను సిరివెలుగులు
    సామజవరగమన {2}

    సొగసులమణి నిగనిగమని
    సామజవరగమన
    మెరిసిన గని మురిసెను మది
    సామజవరగమన
    వెలసెను వలపుల మధువని
    సామజవరగమన

    "దివిని తిరుగు మెరుపు లలన"


    మమతల ఉలి మలచిన కల
    సామజవరగమన
    తళుకుమనెను చెలి కులుకుల
    సామజవరగమన {2}

    సుగుణములను తరగని గని
    సామజవరగమన
    దొరికినదని యెగసెను మధి
    సామజవరగమన
    అరుదగు వరమిది తనదని
    సామజవరగమన

    "దివిని తిరుగు మెరుపు లలన"
    చెలిమి కలిమి మరువ గలన (4)

    ReplyDelete
  53. అయ్యో భవానీ గారూ, మీకంటే ముందు నా పాట పోష్ట్ అయ్యింది. అద్యచ్చా ఇప్పుడు ఎలా?

    ReplyDelete
  54. @బాస్కర్ రామిరెడ్డి
    ఏది వీలుంటే అది.
    ఏదైనా పరవాలేదు. :)

    ReplyDelete
  55. చిత్రం - పసుపు కుంకుమ
    సంవత్సరం - 1955
    రాసిన వారు - తెలియదు
    పాడినవారు - శ్రీ ఘంటసాల
    సంగీతం - ఎం.ఆర్. రావు
    నీవేనా నిజమేనా నీవేనా నిజమేనా
    జీవన రాణివి నీవేనా నా జీవన రాణివి నీవేనా
    పూలతీగెవో పొంగే నదివో తళుకు మెరుపువో తరికి వెన్నెలవో
    పూలతీగెవో పొంగే నదివో తళుకు మెరుపువో తరికి వెన్నెలవో
    మమతగొలుపు అందాలపు నిధివో
    మమతగొలుపు అందాలపు నిధివో
    హృదయవ్వనానందపు సుధవో
    నీవేనా నిజమేనా
    నీలినీడలో నీముంగురులో సమరములో నీ నయనములో
    నీలినీడలో నీముంగురులో సమరములో నీ నయనములో
    మరునివిల్లు ఇరువైపుల సాగిన మరునివిల్లు ఇరువైపుల సాగిన
    విరుల చూపులో వాలుచూపులో
    నీవేనా నిజమేనా
    నిద్దురవనిలో కలలసెయ్యపై ననువరించు నవమోహినివేమో
    నిద్దురవనిలో కలలసెయ్యపై ననువరించు నవమోహినివేమో
    అఖిలావనిలో శోభనింపగా అఖిలావనిలో శోభనింపగా
    అవతరించినా దేవతవేమో
    నీవేనా నిజమేనా
    జీవన రాణివి నీవేనా నా జీవన రాణివి నీవేనా
    నిజమేనా...


    ఈ అత్భుతమైన పాట ఇక్కడ వినండి. కొన్ని కొన్ని చోట్ల నాకు సరిగ్గా అర్ధం కలేదు. దయచేసి నన్ను సరిచెయ్యండి
    http://www.ghantasala.info/allsongs/newmarch2006/066_PasupuKumkuma(1955)_001_Neevena.mp3

    ReplyDelete
  56. భా.రా.రె - ఏంపర్లేదు..తూచ్ అనేస్కుందాం

    ReplyDelete
  57. చిత్రం: విచిత్ర సోదరులు
    సంగీతం: ఇళయరాజా
    గానం: బాలు

    నిన్ను తలచి మైమరచా
    చిత్రమే అది చిత్రమే
    నన్ను తలచి నవ్వుకున్నా
    చిత్రమే అది చిత్రమే "2"
    ఆ నింగినెన్నటికీ
    ఈ భూమి చేరదనీ
    నాడు తెలియదులే
    ఈనాడు తెలిసనులే
    ఓ చెలీ
    "నిన్ను తలచి"


    ఆడుకుంది నాతో జాలి లేని దైవం
    పొందలేక నిన్ను ఓడిపోయే జీవితం
    జోరువానలోనా ఉప్పునైతి నేనే
    హోరుగాలిలోనా ఊకనైతి నేనే
    గాలిమేడలే కట్టుకున్నా
    చిత్రమే అది చిత్రమే
    సత్యమేదో తెలుసుకున్నా
    చిత్రమే అది చిత్రమే
    కధ ముగిసెను కాదా
    కల చెదిరెను కాదా
    అంతే
    "నిన్ను తలచి"

    కళ్ళలోన నేనూ కట్టుకున్న కోట
    నేడు కూలిపోయే ఆశ తీరు పూటా
    కోరుకున్న యోగం జారుకుంది నేడు
    చీకటేమో నాలో చేరుకుంది చూడు
    రాసివున్న తలరాత తప్పదు
    చిత్రమే అది చిత్రమే
    గుండె కోతలే నాకు ఇప్పుడు
    చిత్రమే అది చిత్రమే
    కధ ముగిసెను కాదా
    కల చెదిరెను కాదా
    అంతే
    "నిన్ను తలచి"

    ReplyDelete
  58. చిన్నారి పొన్నారి పూవూ
    విరబూసి విరబూసి నవ్వూ
    మా ఇంటి పొదరింటి పువ్వూ
    నిను జూసి నను జూసి నవ్వూ


    వివరాలు తెలీవు మన్నించాలి.

    ReplyDelete
  59. చిత్రం : మాంగల్యబలం
    గానం : గంటసాల
    వాడిన పూలే వికసించనే .యద మీటిన హృదయాలు పులకిన్చనే
    తీయని కలలే ఫలి ఇంచనే ,యల కోయిల తన గొంతు సవరించనే
    " నే ".

    ReplyDelete
  60. మందాకిని గారు - ఆ పాటా వివరాలు -
    సాహిత్యం - దాశారధి
    సంగీతం - ఆర్. సుదర్శన్
    చిత్రం - నాదీ ఆడజన్మే.
    పాడినవారు - ఘంటసాల, పి.సుశీల.

    చిన్నీ గారు, ౧. గంటసాల కాదు, ఘంటసాల.
    ౨. మందాకిని గారి, ఘంటసాల పాటకి బాలు పాట ఇవ్వాలి.

    ReplyDelete
  61. ఇది మందాకిని గారు పాట అంత్యాక్షరం "వ" తో -

    చిత్రం - ఇంటింటీ రామాయణం
    పాట - వీణవేణూవైన సరిగమ విన్నావా
    పాడినవారు -
    సాహిత్యం - వేటూరి
    సంగీతం - రాజన్ నాగేంద్ర

    వీణ వేణువైన సరిగమ విన్నావా
    ఓ ఒ ఒ ఓ .. తీగ రాగమైన మధురిమ కన్నావా
    తనువు తహతహలాడాల చెలరేగాల
    చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో
    వీణ వేణువైన సరిగమ విన్నావా
    ఓ ఒ ఒ ఓ .. తీగ రాగమైన మధురిమ కన్నావా

    ఊపిరి తగిలిన వేళ - నే వంపులు తిరిగిన వేళ
    నా వీణలో నీ వేణువే - పలికే రాగమాల
    ఆ ఆ ఆ ఆ.. లలలా... ఆ ఆ...
    చూపులు రగిలిన వేళ - ఆ చుక్కలు వెలిగిన వేళ
    నా తనువున అణువణువున - జరిగే రాసలీల
    వీణ వేణువైన సరిగమ విన్నావా
    ఓ ఒ ఒ ఓ .. తీగ రాగమైన మధురిమ కన్నావా

    ఎదలో అందం ఎదుట - ఎదుటే వలచిన వనిత
    నీ రాకతో నా తోటలో - వెలసే వనదేవత
    ఆ ఆ ఆ ఆ.. లలలా... ఆ ఆ...
    కదిలే అందం కవిత - అది కౌగిలికొస్తే యువత
    నా పాటలో నీ వల్లనే - నవతా నవ్య మమత
    వీణ వేణువైన సరిగమ విన్నావా
    ఓ ఒ ఒ ఓ .. తీగ రాగమైన మధురిమ కన్నావా
    తనువు తహతహలాడాల చెలరేగాల
    చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో

    వీణ వేణువైన సరిగమ విన్నావా
    ఓ ఒ ఒ ఓ .. తీగ రాగమైన మధురిమ కన్నావా

    ReplyDelete
  62. వేషము మార్చెను... హోయ్!
    భాషను మార్చెను... హోయ్!
    మోసము నేర్చెన్....
    అసలు తానే మారెను...
    అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!
    మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!

    క్రూరమృగమ్ముల కోరలు తీసెను, ఘోరారణ్యములాక్రమించెను (2)
    హిమాలయముపై జండా పాతెను, (2) ఆకాశంలో షికారు చేసెను
    అయినా మనిషి మారలేదు, ఆతని కాంక్ష తీరలేదు!

    పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను (2)
    వేదికలెక్కెను, వాదము చేసెను, (2) త్యాగమె మేలని బోధలు చేసెను
    అయినా మనిషి మారలేదు, ఆతని బాధ తీరలేదు!

    వేషమూ మార్చెను, భాషనూ మార్చెను,
    మోసము నేర్చెను, తలలే మార్చెను...
    అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!

    ఆ...ఆహహాహాహ ఆహాహహా...
    ఓ... ఓహొహోహోహో ఓహోహొహో...

    చిత్రం : గుండమ్మ కథ
    గానం : ఘంటసాల, పి.సుశీల
    రచన : పింగళి
    సంగీతం : ఘంటసాల

    ReplyDelete
  63. జ్యోతిగారు..అదరహో!!
    చిత్రం - వయసుపిలిచింది
    రచన - ఆరుద్ర
    సంగీతం - ఇళయరాజ
    పాడినవారు - బాలు

    హే ముత్యమల్లే మెరిసిపోయే మల్లెమొగ్గా
    అరె ముట్టుకుంటే ముడుసుకుంటావ్ ఇంత సిగ్గా

    మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిసిందిలే
    ఊరూ నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే

    మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిసిందిలే
    కురిసే సన్నని వానా సలి సలిగా ఉన్నది లోనా
    కురిసే సన్నని వానా సలి సలిగా ఉన్నది లోనా
    గుబులౌతుందే గుండెల్లోనా

    జరగనా కొంచెం నేనడగానా లంచం
    చలికి తలలు వంచం నీ వళ్ళే పూలమంచం
    వెచ్చగ ఉందామూ మనమూ

    హే పైటలాగా నన్ను నువ్వూ కప్పుకోవే
    గుండెలోనా గువ్వలాగా ఉండిపోవే

    మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిసిందిలే

    పండే పచ్చని నేలా అది బీడైపోతే మేలా
    పండే పచ్చని నేలా అది బీడైపోతే మేలా
    వలపు కురిస్తే వయసు తడిస్తే

    పులకరించు నేలా అది తొలకరించు వేళా
    తెలుసుకో పిల్లా ఈ బిడియమేల మళ్ళా
    ఉరికే పరువమిదీ మనదీ

    హే కాపుకొస్తే కాయలన్నీ జారిపోవా
    దాపుకొస్తే కొర్కెలన్నీ తీరిపోవా

    మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిసిందిలే

    నవ్వని పువ్వే నువ్వూ నునువెచ్చని తేనెలు ఇవ్వూ
    దాగదు మనసే ఆగదు వయసే

    ఎరగదే పొద్దూ అది దాటుతుంది హద్దు
    ఈయవా ముద్దూ ఇక ఆగనే వద్దు
    ఇద్దరమొకటవనీ కానీ

    హే బుగ్గ మీదా మొగ్గలన్నీ దూసుకోనీ
    రాతిరంతా జాగారమే చేసుకోనీ

    మబ్బే మసకేసిందిలే పొగమంచే తెరగా నిలిసిందిలే
    ఊరూ నిదరోయిందిలే మంచి సోటే మనకు కుదిరిందిలే
    మంచి సోటే మనకు కుదిరిందిలే

    ReplyDelete
  64. లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో! జగమే ఊగెనుగా
    ఊగెనుగా తూగెనుగా

    తారాచంద్రుల విలాసములతో
    విరిసే వెన్నెల పరవడిలో ఉరవడిలో
    తారాచంద్రుల విలాసములతో
    విరిసే వెన్నెల పరవడిలో
    పూల వలపుతో ఘుమఘుమలాడే
    పిల్ల వాయువుల లాలనలో

    ll లాహిరి ll

    అలల ఊపులో తీయని తలపులు
    చెలరేగే ఈ కలకలలో మిలమిలలో
    అలల ఊపులో తీయని తలుపులు
    చెలరేగే ఈ కలకలలో
    మైమరపించే ప్రేమనౌకలో
    హాయిగ చేసే విహరణలో

    ll లాహిరి ll

    రసమయ జగమును రాసక్రీడకు
    ఉసిగొలిపే ఈ మధురిమలో మధురిమలో
    రసమయ జగమును రాసక్రీడకు
    ఉసిగొలిపే ఈ మధురిమలో
    ఎల్లరి మనములు ఝల్లన జేసే
    చల్లని దేవుని అల్లరిలో

    ll లాహిరి ll

    చిత్రం : మాయాబజార్
    గానం : ఘంటసాల, పి.లీల
    రచన: పింగళి
    సంగీతం: ఘంటసాల

    ReplyDelete
  65. అత్యాంక్షరి బాగా సరదాగా సాగుతుంది. భాస్కర్ గారు, మీకు మా అభినందనలు.

    గొంతు సవరించుకుని నేను ఈరోజు డ్యూటీలోకి దిగుతా...

    ReplyDelete
  66. చిత్రం: కళ్యాణి
    గానం: బాలు
    రచన: సినారె
    సంగీతం: రమేష్ నాయుడు

    లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను "2"
    మధుర భారతి పద సన్నిధిలో ఒదిగే తొలి పూవును నేను
    "లలిత"

    ఏ ఫలమాశించి మత్తకోకిల ఎలుగెత్తి పాడును "2"
    ఏ వెల ఆశించి పూచే పువ్వు తావిని విరిజిమ్మును "2"
    అవధి లేని ప్రతి అనుభూతికి ఆత్మానందమే పరమార్ధము
    "లలిత"

    ఏ సిరి కోరి పోతన్న భాగవత సుధలు చిలికించెను
    ఏ నిధి కోరి త్యాగయ్య రాగ జలనిధులు పొంగించెను
    రమణీయ కళావిష్కృతికి రసానందమే పరమార్ధం
    "లలిత"
    "ను "

    ReplyDelete
  67. చివరి ఆక్షరం ఏది ? "త" న లేక "న" నా?

    ReplyDelete
  68. నిలువవే వాలు కనులదానా
    వయ్యారి హంస నడకదానా
    నీ నడకలో హోయలున్నవే చానా
    నువ్వు కులుకుతూ గల గల నడుస్తూ ఉంటే
    నిలువదే నా మనసు
    ఓ లలనా అది నీకే తెలుసు

    నిలువవే....

    ఎవరని ఎంచుకోనినావో
    పరుడని భ్రాన్తిపదినావో
    ఎవరని ఎంచుకోనినావో.. భ్రాంతి పదినావో
    సిగ్గుపడి తోలిగేవో
    విరహాగ్నిలో నను తోసి పోయేవో

    నువు కులుకుతూ...

    ఒకసారి నను చూడరాదా
    చెంతచేరా సమయమిది కాదా
    ఒకసారి నను చూడరాదా
    సమయమిది కాదా
    వగలాడి నే నీవాడనే కాదా

    నువు కులుకుతూ

    మగాడంటే మొజులేనిదానా
    మనసుంటే నీకు నేను లేనా
    మగాడంటే మోజు లేనిదానా .. నీకు నేను లేనా
    కోపమా నా పైనా
    నీ నోటి మాటకే నోచుకోలేనా

    నిలువవే...

    చిత్రం : ఇల్లరికం
    గానం : ఘంటసాల
    రచన :కొసరాజు
    సంగీతం : టి. చలపతిరావు

    ReplyDelete
  69. చిత్రం - సాగర సంగమం
    సాహిత్యం - వేటూరి వారు
    సంగీతం - ఇసై జ్ఞాని ఇళయరాజా వారు
    పాడింది - బాలు, మరియూ శైలజ

    వేవేలా గోపెమ్మలా మువ్వా గోపాలుడే....
    మా ముద్దూ గోవిందుడే
    మువ్వా గోపాలుడే మా ముద్దూ గోవిందుడే
    అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల
    వేణువులూదాడే మది వెన్నెలు దోచాడే
    ఆ హహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే....
    మా ముద్దూ గోవిందుడే

    మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే
    మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే
    కన్న తోడు లేని వాడే కన్నె తోడు ఉన్నవాడే
    మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనె
    మోహనాల వేణువూదే మోహనాంగుడితడేనె
    చీరలన్ని దోచి దేహ చింతలన్ని తీర్చినాడే
    పోతన్న కైతలన్ని పోతపోసుకున్నాడె
    మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
    ఆ హహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే
    మా ముద్దూ గోవిందుడే
    వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
    వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే
    రాసలీలలాడినాడే రాయబారమేగినాడే
    గీతార్ధ సారమిచ్చీ గీతలెన్నొ మార్చేనే
    గీతార్ధ సారమిచ్చీ గీతలెన్నొ మార్చేనే
    నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే
    వరదయ్య గానాల వరదలై పొంగాడే
    మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే
    ఆ హహహ వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే
    మా ముద్దూ గోవిందుడే
    అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే
    మది వెన్నెలు దోచాడే
    అహ అన్నుల మిన్నల కన్నుల వెన్నెల వేణువులూదాడే మది వెన్నెలు దోచాడే
    ఆ హహహవేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దూ గోవిందుడే


    గమనిక - డ తో పాట దొరకని చో "ద" తో మొదలుపెట్ట వచ్చును...

    ReplyDelete
  70. చిత్రం - జయం మనదే
    సాహిత్యం - తెలియదు
    సంగీతం - ఘంటసాల
    పాడింది - ఘంటసాల


    దేశభక్తిగల అయ్యల్లారా, జాలిగుండెగల అమ్మలారా!
    ఆలోచించండి న్యాయం ఆలోచించండి (దేశభక్తిగల)


    దున్నేవాడికి యెక్కడ జూచిన యెన్నో ఈడవలు అబ్బో యెన్నోపాడవలు
    దున్నేవాడికి చారెడు నేలయు దొరకగ పోదండి

    కష్టం విరగడ కాదండి (దేశభక్తిగల)
    రెక్కలు విరుచుక శ్రమ పడువానికి
    బొక్కెడు మెతుకులు కరువండి
    గుక్కెడు గంజి కరువండి

    నిక్కుతు తిరిగే సోమరిపోతుకు ఉక్కిరి బిక్కిరి తిండండి
    డొక్కకు మించిన బరువండి (దేశభక్తిగల)


    పచ్చని వన్నెల పైరు జొన్న బల్‍ పంట బండి తల వంచింది
    బంగారం వలె మెరిసింది

    కాకుల దరిమే కావలి వాడు ఊత బియ్యముకు నోచక ఉసూరుమంటూ

    చూస్తూ ఉండే (దేశభక్తిగల)

    ReplyDelete
  71. "డ" లేక "ద" తో అంతం. హంతేనా శ్రీ భాయ్ ?

    ReplyDelete
  72. చిత్రం: ఇంద్రుడు చంద్రుడు
    సంగీతం: ఇళయరాజా
    గానం: బాలు, జానకి

    దోర దోర దొంగ ముద్దు దోబూచీ
    హొయన హొయన
    తేర తేర తేనె బుగ్గ లాగించీ
    హొయన హొయన
    ఆగమన్నా నీ మీదే పిచ్చి
    రేగుతుంటే వేగేదెట్టా
    వద్దు అన్న ఇట్టా పైకొచ్చి లాగుతుంటే
    ఆపేదెట్టా

    దోర దోర దొంగ ముద్దు దోబూచీ
    హొయన హొయన
    తేర తేర తేనె బుగ్గ లాగించీ

    ReplyDelete
  73. చిత్రం - వీరాభిమన్యు
    సాహిత్యం - ఆరుద్ర
    సంగీతం - కె.వి.మహదేవన్
    పాడింది - ఘంటసాల



    చూచీ వలచీ చెంతకు పిలచీ
    నీ సొగసులు లాలన చేసీ నీ సొంపుల ఏలిక నైతి

    చూచీ వలచీ చెంతకు చేరీ
    నా సొగసులు కానుక జేసీ నీ మగసిరి బానిసనైతి

    అందాలన్నీ దోచీ ఆనందపుటంచుల చూచీ
    సందిట బందీ చేసి
    నా బందీ వశమై పోతీ

    నూతన వధువై నిలచీ వరుని వలపుల మధువై మారి
    సఖునీ ఒడిలో సురిగీ
    కోటి సుఖముల శిఖరము నైతి

    వలపు తేనెల మధురిమ గ్రోలితి నిదురా జగమూ మరచీ
    నేటికి నిండుగ పండితి ...

    ' త ' తో పాడండి.

    ReplyDelete
  74. చిత్రం - దేవదాసు
    సంగీతం - సి.ఆర్.సుబ్బురామన్
    నేపధ్యం - ఘంటసాల వెంకటేశ్వరరావు, కె.రాణి
    సాహిత్యం - సముద్రాల రాఘవాచార్య

    చెలియలేదు చెలిమిలేదు వెలుతురేలేదూ
    చెలియలేదు చెలిమిలేదు వెలుతురేలేదూ
    ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే
    ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే మిగిలిందీ నీవేనే
    చెలియలేదు చెలిమిలేదు వెలుతురేలేదు

    చెలిమి పోయే చెలువుపోయే నెలవే వేరాయే
    చెలిమి పోయే చెలువుపోయే నెలవే వేరాయే
    చేరతీసి సేవచేసే తీరూ కఱువాయే
    చేరతీసి సేవచేసే తీరూ కఱువాయే నీ దారే వేరాయే
    చెలిమి పోయే చెలువుపోయే నెలవే వేరాయే

    మఱపురానీ బాధకన్నా మధురమే లేదూ
    మఱపురానీ బాధకన్నా మధురమే లేదూ
    గతము తలచి వగచేకన్నా సౌఖ్యమే లేదూ
    గతము తలచి వగచేకన్నా సౌఖ్యమే లేదూ
    అందరాని పోందూ కన్నా అందమే లేదూ ఆనందమే లేదూ
    చెలియలేదు చెలిమిలేదు వెలుతురేలేదూ

    వరదపాలౌ చెఱువులైనా పొరలి పారానే
    వరదపాలౌ చెఱువులైనా పొరలి పారానే
    రగిలిపొగలౌ కుండనైనా పగిలిజారేనే
    రగిలిపొగలౌ కుండనైనా పగిలిజారేనే
    దారిలేనీ బాధతో నేనారిపోయేనా కధ తీరీపోయేనా
    చెలిమి పోయే చెలువుపోయే నెలవే వేరాయే
    ఉన్నదంతా చీకటైతే ఉందీ నీవేనే
    మిగిలిందీ నీవేనే

    ReplyDelete
  75. పాడింది - బాలు
    చిత్రం - అంతులేని కధ
    సంగీతం - ఎం. యస్. విశ్వనాధన్
    సాహిత్యం - ఆచార్య ఆత్రేయ.

    తాళికట్టు శుభవేళ మెడలో కల్యణమాల
    ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో హ హ
    ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
    తాళికట్టు శుభవేళ మెడలో కల్యణమాల
    వికటకవి నేను వినండి ఒక కధ చెపుతాను
    కాకులు దూరని కారడవి
    అందులో కాలం ఎరుగని మానోకటి
    ఆ అందాల మానులో ఆ అద్బుత వనంలో
    చక్కని చిలకలు అక్కా చెల్లెలు పక్కన గోరింకలు
    ఒక గోరింక ఓ చిలకమ్మకు ఒద్దిక కుదిరెనమ్మ
    బావ రావ నన్నేలుకోవా
    తాళికట్టు శుభవేళ మెడలో కల్యణమాల
    ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో హ హ
    ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
    తాళికట్టు శుభవేళ మెడలో కల్యణమాల

    మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగెనమ్మ
    మేళాలు తాళాలు మంగళ వాద్యాలు మిన్నంటి మోగెనమ్మ
    వలపు విమాన తలపుల వేగాన వచ్చాయి కానుకలమ్మ
    ఊరేగు దారులు వయ్యారి భామలు వీణలు మీటిరమ్మ
    సింగారి జాణల ముంగాలి మువ్వలు ఘల్లున మోగెనమ్మ
    తాళికట్టు శుభవేళ మెడలో కల్యణమాల
    ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో హ హ
    ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
    తాళికట్టు శుభవేళ మెడలో కల్యణమాల

    గోమాత లేగతో కొండంత ప్రేమతో దీవించు వచ్చెనమ్మా
    కాన్వెంటు పిల్లలు పోలిన నెమళులు గ్రీటింగ్స్ చెప్పిరమ్మ
    నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మ
    నాలుగు వేదాలు వల్లించు హరిణాలు మంత్రాలు చదివెనమ్మ
    పట్టపుటేనుగు పచ్చగ నూరేళ్ళు వర్ధిల్లమనెనమ్మ
    తాళికట్టు శుభవేళ మెడలో కల్యణమాల
    ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో హ హ
    ఏనాడు ఏ జంటకో రాసి వున్నాడు విధి ఎప్పుడో
    తాళికట్టు శుభవేళ మెడలో కల్యణమాల

    చేయి చేయిగ చిలుక గోరింక శయ్యకు తరలిరమ్మ
    చెల్లిలికోసం త్యాగము చేసిన చిలుకమ్మ తొలెగెనమ్మ
    తప్పుగ తలచిన అప్పటి గోరింక ఇప్పుడు తెలిసెనమ్మ
    అది చిలుకే కాదని బావిలో కప్పని జాలిగ తలచెనమ్మ

    ReplyDelete
  76. చిత్రం: మహర్షి
    గానం: బాలు
    సంగీతం: ఇళయరాజా

    మాట రాని మౌనమిది
    మౌనవీణ గానమిది "2"
    గానమిది నీ ధ్యానమిది
    ధ్యానములో నా ప్రాణమిది
    ప్రాణమైన మూగగుండె రాగమిది
    మాట రాని మౌనమిది
    మౌనవీణ గానమిది "2"

    ముత్యాల పాటల్లో కోయిలమ్మ
    ముద్దారబోసేది ఎప్పుడమ్మా
    ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మా
    దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
    ఈ మౌన రాగాల ప్రేమావేశం
    ఏనాడో ఒకరి సొంతం
    ఆకాశదీపాలు జాబిలి కోసం
    నీకేలా ఇంత పంతం
    నింగీ నేలా కూడే వేళా
    నికూ నాకూ దూరాలేల
    అందరాని కొమ్మ ఇది
    కొమ్మ చాటు అందమిది
    మాట రాని మౌనమిది
    మౌనవీణ గానమిది

    చైత్రాన కూసేను కోయిలమ్మా
    గ్రీష్మానికా పాట ఎందుకమ్మా
    రేయంత నవ్వేను వెన్నెలమ్మా
    నీరెండకా నవ్వు ఎందుకమ్మా
    రాగాల తీగల్లో వీణానాదం
    కోరింది ప్రణయ వేదం
    వేసారు గుండెల్లో రేగే గాయం
    పాడిని మధుర గేయం
    ఆకాశాన తారాతీరం
    అంతేలేని ఎంతో దూరం
    మాట రాని మౌనమిది
    మౌనవీణ గానమిది

    ReplyDelete
  77. భవానీ గారు - పప్పులోకాలేసారు. నా బాలూ పాటకి మీరు ఘంటసాల గారి పాటని ఇవ్వాల్సి ఉంది, కానీ మీరు బాలూ పాటకి బాలూ పాటనే ఇచ్చారు...గమనించగలరు.

    ReplyDelete
  78. అయ్యో! సారీ అండి.

    ReplyDelete
  79. భా.రా.రాజు, ఈ రోజు నాకాలు పూర్తిగా ఆఫీస్ ఊబిలో కూరుకుపోయింది. పప్పులో కాలేద్దామన్నా వెయ్యలేక పోతున్నా :(

    ReplyDelete
  80. భవానీ గారు -సారీలు లారీలు దేనికండీ :):) ఏం పర్లేదు.
    భా.రా.రె - శుక్రోరం నాడు పనా? ఎవుడయ్యా అదీ మీ మేనెజరు? మన పేరుజెప్పు.

    ReplyDelete
  81. నా కాలు కడుక్కున్నానోచ్!!

    చిత్రం: మూగమనసులు
    గానం: ఘంటసాల
    సంగీతం: కె.వి.మహదేవన్

    ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులు
    ఎనక జనమ బాసలూ ఎందరికి తెలుసులే "2"

    పూల దండలో దారం దాగుందని తెలుసును
    పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా "2"
    నవ్వినా ఏడ్చినా "2"
    కన్నీళ్ళే వస్తాయి
    ఏ కన్నీటెనకాలా ఏముందో తెలుసునా

    ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులు
    ఎనక జనమ బాసలూ ఎందరికి తెలుసులే

    మనసు మూగదే కానీ బాసుండది దానికీ
    చెవులుండే మనసుకె ఇనిపిస్తుందా ఇది "2"
    ఎద మీదా ఎద బెట్టి సొదలన్నీ ఇనుకో
    ఇనుకొని బతుకుని ఇంపుగా దిద్దుకో

    ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులు
    ఎనక జనమ బాసలూ ఎందరికి తెలుసులే

    ముక్కోటి దేవత్లు మురిసీ చూస్తుంటరు
    ముందు జనమ బంధాలూ ముడియేసీ పెడతారు
    కన్నోళ్ళ కన్నిళ్ళు కడుపుతీపి దీవెనలు
    మూగమనసు బాసలూ
    ఈ మూగమన్సు బాసలు మీకిద్దరికీ సేతలు

    ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులు
    ఎనక జనమ బాసలూ ఎందరికి తెలుసులే
    ముద్దబంతి పూవులో

    ReplyDelete
  82. @బ.రా.రె
    లారీలు మాత్రం నావల్ల కాదులెండి.
    ఇదే ప్రచురించండి. ముందుది వద్దు.

    నా కాలు కడుక్కున్నానోచ్!!

    చిత్రం: మూగమనసులు
    గానం: ఘంటసాల
    సంగీతం: కె.వి.మహదేవన్

    ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులు
    ఎనక జనమ బాసలూ ఎందరికి తెలుసులే "2"

    పూల దండలో దారం దాగుందని తెలుసును
    పాల గుండెలో ఏది దాగుందో తెలుసునా "2"
    నవ్వినా ఏడ్చినా "2"
    కన్నీళ్ళే వస్తాయి
    ఏ కన్నీటెనకాలా ఏముందో తెలుసునా

    ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులు
    ఎనక జనమ బాసలూ ఎందరికి తెలుసులే

    మనసు మూగదే కానీ బాసుండది దానికీ
    చెవులుండే మనసుకె ఇనిపిస్తుందా ఇది "2"
    ఎద మీదా ఎద బెట్టి సొదలన్నీ ఇనుకో
    ఇనుకొని బతుకుని ఇంపుగా దిద్దుకో

    ముద్దబంతి పూవులో మూగకళ్ళ ఊసులు
    ఎనక జనమ బాసలూ ఎందరికి తెలుసులే

    ముక్కోటి దేవతలు మురిసీ చూస్తుంటరు
    ముందు జనమ బంధాలూ ముడియేసీ పెడతారు
    కన్నోళ్ళ కన్నీళ్ళు కడుపుతీపి దీవెనలు
    మూగమనసు బాసలూ
    ఈ మూగమనసు బాసలు మీకిద్దరికీ సేతలు

    ముద్దబంతి పువ్వులో మూగకళ్ళ ఊసులు
    ఎనక జనమ బాసలూ ఎందరికి తెలుసులే
    ముద్దబంతి పూవులో

    ReplyDelete
  83. చిత్రం - మూడు ముళ్ళు
    రచన - జ్యోతిర్మయి
    సంగీతం - రాజన్ - నాగేంద్ర
    పాదినవారు - బాలు, జానకి (అనుకుంటా)

    లేత చలిగాలులు హోయ్ దోచుకోరాదురా
    చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా
    లేత చలిగాలులు దోచుకోలేవులే
    మన వలపువాకిలిని అవి తాకగలేవులే

    లేత చలిగాలులు హోయ్ దోచుకోరాదురా
    అందాల నా కురులతో వింజామరలు వీచనా
    అందాల నా కురులతో వింజామరలు వీచనా
    రాగం భావం స్నేహం మోహం నిన్నే వేడనా
    నీ కురులవీవదలకు నా హ్రుదయమర్పించనా
    రూపం దీపం శిల్పం నాట్యం నీలో చూడనా
    కనుల భాష్పాలు కలల భాష్యాలు
    వలపుగా సాగి వలలుగా మూగి కాలాన్ని బంధించగా

    లేత చలిగాలులు హోయ్ దోచుకోరాదురా
    చలి వెలుగు వెన్నెలలు నిను తాకగా తగవురా
    లేత చలిగాలులు దోచుకోలేవులే

    అధరాల కావ్యాలకు ఆవేశమందించనా(2)
    వలపే పిలుపై వయసే ముడుపై నిన్నే చేరనా
    మందార ముకుళాలతో పాదాలు పూజించనా
    అలనై కలనై విరినై ఝురినై నిన్నే కోరనా
    హృదయనాదాల మధురరాగాల
    చిగురు సరసాల నవవసంతాల విరిలెన్నో అందించగా

    లేత చలిగాలులు దోచుకోలేవులే
    మన వలపువాకిలిని అవి తాకగలేవులే

    ReplyDelete
  84. చిత్రం: గుండమ్మ కధ
    గానం: ఘంటసాల
    సంగీతం: ఘంటసాల
    రచన: పింగళి నాగేంద్ర రావు


    లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
    దద్దరిల్లింది పురుషప్రపంచం

    ఎపుడో చెప్పెను వేమన గారు
    అపుడే చెప్పెను బ్రహ్మం గారు "2"
    ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా
    విస్సన్న చెప్పిన వేదం కూడా
    లేచింది నిద్ర లేచింది మహిళాలోకం

    పల్లెటూళ్ళలో పంచాయ్తీలూ
    పట్టణాలలో ఉద్యోగాలు "2"
    అది ఇది ఏమని అన్ని రంగముల "2"
    మగధీరులనెదిరించారు
    నిరుద్యోగులను పెంచారు

    లేచింది నిద్ర లేచింది మహిళాలోకం

    చట్టసభలలో సీట్ల కోసం
    భర్తలతోనే పోటీ చేసి "2"
    డిల్లీ సభలో పీఠం వేసి "2"
    లెక్చరులెన్నో దంచారు
    విడాకు చట్టం తెచ్చారు

    లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
    దద్దరిల్లింది పురుష ప్రపంచం
    లేచింది నిద్ర లేచింది మహిళాలోకం

    ReplyDelete
  85. చిత్రం: మహర్షి
    గానం: బాలు
    సంగీతం: ఇళయరాజా

    మాట రాని మౌనమిది
    మౌనవీణ గానమిది "2"
    గానమిది నీ ధ్యానమిది
    ధ్యానములో నా ప్రాణమిది
    ప్రాణమైన మూగగుండె రాగమిది
    మాట రాని మౌనమిది
    మౌనవీణ గానమిది "2"

    ముత్యాల పాటల్లో కోయిలమ్మ
    ముద్దారబోసేది ఎప్పుడమ్మా
    ఆ పాల నవ్వుల్లో వెన్నెలమ్మా
    దీపాలు పెట్టేది ఎన్నడమ్మా
    ఈ మౌన రాగాల ప్రేమావేశం
    ఏనాడో ఒకరి సొంతం
    ఆకాశదీపాలు జాబిలి కోసం
    నీకేలా ఇంత పంతం
    నింగీ నేలా కూడే వేళా
    నికూ నాకూ దూరాలేల
    అందరాని కొమ్మ ఇది
    కొమ్మ చాటు అందమిది
    మాట రాని మౌనమిది
    మౌనవీణ గానమిది

    చైత్రాన కూసేను కోయిలమ్మా
    గ్రీష్మానికా పాట ఎందుకమ్మా
    రేయంత నవ్వేను వెన్నెలమ్మా
    నీరెండకా నవ్వు ఎందుకమ్మా
    రాగాల తీగల్లో వీణానాదం
    కోరింది ప్రణయ వేదం
    వేసారు గుండెల్లో రేగే గాయం
    పాడిని మధుర గేయం
    ఆకాశాన తారాతీరం
    అంతేలేని ఎంతో దూరం
    మాట రాని మౌనమిది
    మౌనవీణ గానమిది

    ReplyDelete
  86. భవానీ మేడం - శ్రీ భాయ్ ఇంతక ముందే ఈ పాట ని పేర్కొన్నారు.

    ReplyDelete
  87. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అయిపోయింది...కాబట్టి తూచ్. తిరిగి రాయకూడాదోచ్..

    ReplyDelete
  88. చిత్రం: కంచుకోట
    గానం: ఘంటసాల, సుశీల
    సంగీతం: కె.వి.మహదేవన్

    లేదు లేదనీ ఎందుకు నీలో ఉన్నది దాస్తావు
    ఇలా ఉరకలు వేస్తావు నీలో ఉన్నది దాస్తావు "2"
    ఉంది ఉందనీ ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
    లేని దానిని తీస్తావు నాలో ఉన్నది దోస్తావు "2"

    ReplyDelete
  89. చిత్రం: అభిలాష
    సంగీతం: ఇళయరాజా
    రచన : ఆత్రేయ
    గళం : బాలు, పి.సుశీల


    ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
    సొగసులై బృందావని విరిసెనా సిగలోనికి
    జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
    చిగురాకు చరణాలకి సిరిమువ్వు రవళీ
    రసమయం జగతి

    నీ ప్రణయభవం నా జీవ రాగం
    నీ ప్రణయభవం నా జీవ రాగం
    రాగాలు తెలిపే భావాలు నిజమైనవి
    లోకాలు మురిసే స్నేహాలు రుజువైనవి
    అనురాగ రాగాల పరలోకమె మనదైనది

    ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
    సొగసులై బృందావని విరిసెనా సిగలోనికి
    జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
    చిగురాకు చరణాలకి సిరిమువ్వు రవళీ
    రసమయం జగతి

    నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
    నా పేద హృదయం నీ ప్రేమ నిలయం
    నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది
    నీవన్న మనిషే ఈ నాడు నాదైనది
    ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది

    ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి
    సొగసులై బృందావని విరిసెనా సిగలోనికి
    జత వెతుకు హృదయానికీ శృతి తెలిపె మురళీ
    చిగురాకు చరణాలకి సిరిమువ్వు రవళీ
    రసమయం జగతి

    ReplyDelete
  90. తెలిసిందిలే తెలిసిందిలే
    నెలరాజ నీ రూపు తెలిసిందిలే

    చలిగాలిరమ్మంటు పిలిచిందిలే
    చెలి చూపు నీ పైన నిలిచిందిలే

    ఏముందిలే ఇపుడేముందిలే
    మురిపించు కాలమ్ము
    ముందుందిలే నీ ముందుందిలే
    ll తెలిసిందిలే ll

    వరహల చిరునవ్వు కురిపించవా
    పరువాల రాగాలు పలికించవా
    ఆ...

    అవునందునా కాదందునా
    అయ్యారే విధి లీల
    అనుకొందునా అనుకొందునా

    ll తెలిసిందిలే ll

    సొగసైన కనులేమో నాకున్నవి
    చురుకైన మనసేమో నీకున్నది
    కనులేమిటో ఈ కథ లేమిటో
    శ్రుతిమించి రాగన పడనున్నది పడుతున్నది
    ll తెలిసిందిలే ll

    చిత్రం : రాముడు భీముడు
    గానం : ఘంటసాల, పి.సుశీల
    రచన : డా.సి.నారాయణ రెడ్డి
    సంగీతం: పెండ్యాల నాగేశ్వర్‌రావు

    ReplyDelete
  91. చిత్రం: దేవుడు చేసిన మనుషులు
    పాడినవారు: యస్.పి.బి.

    దోరవయసు చిన్నది లాలాలాలాహ
    భలే జోరుగున్నది లాలాలాలాహ
    దీని తస్సా దియ్యా ఖస్సుమంటున్నదీ, కవ్విస్తూఉన్నదీ.

    ReplyDelete
  92. పాట - దేవి శ్రీదేవీ మొరలాలించి పాలించి నన్నేలినావే
    రచ్చన - అనిశెట్టి
    సంగీతం - సుసర్ల దక్షిణామూర్తి
    గానం - ఘంటసాల

    దేవి శ్రీదేవీ
    దేవి శ్రీదేవీ
    మొరలాలించి పాలించి నన్నేలినావే
    దేవి శ్రీదేవీ
    మొరలాలించి పాలించి నన్నేలినావే
    దేవి శ్రీదేవీ
    మదిలో నిన్నే మరువను దేవీ
    మదిలో నిన్నే మరువను దేవీ
    నీ నామ సంకీర్తనేజేసెద
    దేవి శ్రీదేవీ
    మొరలాలించి పాలించి నన్నేలినావే
    దేవి శ్రీదేవీ
    నీకనుసన్నల నిరతరము నన్నే
    నీకనుసన్నల నిరతరము నన్నే
    హాయిగా ఓలలాడించరావే
    నీకనుసన్నల నిరతరము నన్నే
    హాయిగా ఓలలాడించరావే
    ఇలదేవతగా
    ఇలదేవతగా వెలసితివీవే
    ఇలదేవతగా వెలసితివీవే
    ఈడేరే కోర్కిలీనాటికే
    దేవి శ్రీదేవీ
    మొరలాలించి పాలించి నన్నేలినావే
    దేవి శ్రీదేవీ

    ReplyDelete
  93. వయ్యారి గోదారమ్మ
    ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
    కడలి ఒడిలో కలసిపోతే కల - వరం
    ఇన్ని కల్లిక ఎందుకో కన్నె కలయిక కోరుకో
    కలవరింతే కౌగిలింతై
    వయ్యారి ...


    నిజము నా స్వప్నం అహా
    కలనో ఓహో లేనో ఓహో హో
    నీవు నా సత్యం అహా
    అవునో ఓహో కానో ఓహో హో
    ఊహ నీవే ఆహాహాహా ఉసురుకారాదా ఆహా
    మోహమల్లె ఆహాహాహా ముసురుకోరాదా ఆహా
    నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ
    మువ్వగోపాలుని రాధికా
    ఆకాశవీణ గీతాలలోన ఆలపనై నే కరిగిపోనా
    వయ్యారి....

    తాకితే తాపం ఓహో
    కమలం ఓహో భ్రమరం ఓహో హో
    పలికితే మైకం ఓహో
    అధరం ఓహో మధురం ఓహో హో
    ఆటవెలది ఆహాహాహా ఆడుకోరావే
    తేటగీతి ఆహాహా హా తేలిపోనీవే
    పున్నాగ కోవెల్లోన పూజారి దోసిళ్ళన్ని యవ్వనాలకు కానుక
    చుంబించుకున్న బింభాధరాల
    సూర్యోదయాలే పండేటి వేళ
    వయ్యారి


    చిత్రం : ప్రేమించు పెళ్లాడు
    గానం : ఎస్.పి.బాలు, ఎస్.జానకి
    రచన : వేటూరి
    సంగీతం: ఇళయరాజా

    ReplyDelete
  94. చిత్రం - జయభేరి
    రచన - మల్లాది
    సంగీతం - పెండ్యాల నాగేశ్వరరావు
    గానం - ఘంటసాల

    రాగమయి రావే అనురాగమయి రావే
    రాగమయి రావే అనురాగమయి రావే
    రాగమయి రావే
    నీలాల గగనాన నిండిన వెన్నెల
    నీలాల గగనాన నిండిన వెన్నెల
    నీ చిరునవ్వుల కలకల లాడగా
    రాగమయి రావే అనురాగమయి రావే
    రాగమయి రావే
    చిగురులు మేసిన చిన్నారి కోయిల మరిమరి మురిసే మాధురి నీవే
    చిగురులు మేసిన చిన్నారి కోయిల మరిమరి మురిసే మాధురి నీవే
    తనువై మనసై నెలరాయనితో కలువలు కులికే సరసాలు నీవే
    సరసాలు నీవే సరాగాలు నేనే
    రాగమయి రావే అనురాగమయి రావే
    రాగమయి రావే

    సంధ్యలలో, సంధ్యలలో హాయిగాసాగే చల్లని గాలిలో
    మరుమల్లెల విరజాజుల పరిమళమే నీవు
    చిలుగే సింగారమైన చుక్క చన్నెలు అమరాన
    చిలుగే సింగారమైన చుక్క చన్నెలు అమరాన
    సంబరపడు చక్కిలిగింతల పరవశమే నేను నవ పరిమళమే నీవు
    రావే రాగమయి నా అనురాగమయి
    రావే రాగమయి నా అనురాగమయి

    నీడచూసి నీవనుకొని పులకరింతునే
    అలవికాని మమతలతో కలవరింతునే
    కన్నెలందరు కలలుకనే అందాలన్నీ నీవే
    నిన్నందుకొని మైమరిచే ఆనందమంతా నేనే
    రావే రాగమయి నా అనురాగమయి
    రావే రాగమయి నా అనురాగమయి

    ReplyDelete
  95. నేనైతే యి, ఈ . ఒకటే అనుకుని పాట ఇస్తున్నాను..


    ఈ గాలి ఈ నెల ఈ వూరు సేలయేరు
    ఈ గాలి ఈ నెల ఈ వూరు సేలయేరు
    నన్నుగన్న నా వాళ్ళు ఆ నా కళ్ళ లోగిళ్ళు
    నన్నుగన్న నా వాళ్ళు ఆ నా కళ్ళ లోగిళ్ళు

    ఈ గాలి||

    చిన్నారి గోరవంక కూసేను ఆ వంక నా వ్రాత తెలిశాక వచ్చేను నా వంక
    చిన్నారి గోరవంక కూసేను ఆ వంక నా వ్రాత తెలిశాక వచ్చేను నా వంక
    ఏన్నాల్లో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాక
    ఏన్నాల్లో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాక
    ఉప్పోంగిన గుండెలకేక యేగసేను నింగి దాక
    ఉప్పోంగిన గుండెలకేక యేగసేను నింగి దాక
    యేగసేను నింగి దాక

    ఈ గాలి||

    యేనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళ్ళను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడొ ఈ కళ్ళను
    యేనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళ్ళను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడొ ఈ కళ్ళను
    ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ గగను
    ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ గగను
    ఈ రాళ్ళే జవరాలై ఇక నాట్యాలాడేను
    ఈ రాళ్ళే జవరాలై ఇక నాట్యాలాడేను


    చిత్రం : సిరివెన్నెల
    గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం
    రచన : సిరివెన్నెల
    సంగీతం :కె.వి.మహదేవన్

    ReplyDelete
  96. చిత్రం - ఆరాధన
    రచన - శ్రీ శ్రీ
    సంగీతం - సాలూరి రాజేశ్వర రావు
    గానం - ఘంటసాల

    నా హృదయంలో నిదురించే చెలీ!
    కలలలోనే కవ్వించే సఖీ
    మయూరివై వయారివై నేడే
    నటనమాడి నీవే
    నన్ను దోచినావే!
    నా హృదయంలో నిదురించే చెలీ!


    నీ కన్నులలోన - దాగెనులే వెన్నెలసోన
    చకోరమై నిను వరించి
    అనుసరించినానే
    కలవరించినానే
    నా హృదయంలో నిదురించే చెలీ!

    నా గానములో నీవే
    ప్రాణముగా పులకరించినావే (2)
    పల్లవిగా పలుకరించరావే (2)
    నీ వెచ్చని నీడ - వెలసెను నా వలపుల మేడ
    వెచ్చని నీడ - వెలసెను నా వలపుల మేడ
    నివాళితో చేయి చాచి ఎదురుచూచినానే
    నిదుర కాచినానే
    నా హృదయంలో నిదురించే చెలీ!

    ReplyDelete
  97. ళ ళ ళ ళ ఇది రవళే అది రవళే
    ళ ళ ళ ళ చెలి సరళే తెలుం తమిళే
    తెలిసినది చిలిపి కలె
    య ర ల వ ల శ ష స హ లే
    తుళ్ళు తుళ్ళు నడుము బళే
    తళ్ళి తళ్ళి నడక బళే

    వేళాకోళం తాళం
    కాళ్ళావేళా కళ్ళెం
    పళ్ళెం పళ్ళెం పళ్ళెం
    అది మల్లిందంటె పల్లం

    ఒళ్ళు ఒళ్ళు కలుపు అది కల్యాణాల వలపు
    కళ్ళు కుళ్ళు కలుపు ఎద గుళ్ళూ
    కల్ల కపటమేది కసిమేళం మాత్రం నాది
    పెళ్ళి దాకా వెళ్ళూ పెనుగుళ్ళూ
    కుళ్ళు లేని కులుకు ముల్లు కోరు మనసు
    మనకు కాస్త ఉళ్ళా రాబళ్ళా

    చిత్రం: అబద్ధం
    గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం

    ReplyDelete
  98. హమ్మయ్య...100వ కామెంటు నాకొచ్చిందోచ్.....

    చిత్రం - ప్రేం నగర్
    రచన - ఆత్రేయ
    సంగీతం - కె.వి.మహదేవన్
    గానం - ఘంటసాల

    లే, లే, లే, లేలేలే నా రాజా, లేలే నా రాజా

    లేవనంటావా, నన్ను లేపమంటావా నిద్దుర లేవనంటావా, నన్ను లేపమంటావా

    లేలేలే నా రాజా, లేలే నా రాజా

    పెటపెటలాడే పచ్చివయసు పైపైకొచ్చిందీ

    వచ్చి, వచ్చి మెరమెరలాడే మేని నునుపు మెత్తగ తగిలిందీ

    మెత్తని మత్తూ, వెచ్చని ముద్దూ ఒద్దిక కుదిరిందీ

    ఇద్దరు ఉంటే ఒక్కరికేలా నిద్దుర వస్తుందీ

    రా, రా, రా, రా ఆ నా రోజా, రావే నా రోజా

    రాతిరయ్యిందా, నన్ను లేచిరమ్మందా

    లేలేలే నా రాజా, లేలే నా రాజా



    నల్లనల్లని కన్నులలోన ఎర్రని కైపుందీ

    ఎర్ర ఎర్రనీ కుర్రతనములూ జుర్రుకుతాగాలీ

    తాగిన రాత్రీ, తాగని పగలూ ఒక్కటి కావాలీ

    ఆఖరి చుక్కా, చక్కని చుక్కా అప్పుడు ఇవ్వాలీ

    రా, రా, రా, రా ఆ నా రోజా, రావే నా రోజా

    రాతిరయ్యిందా, నన్ను లేచిరమ్మందా

    లేలేలే నా రాజా, లేలే నా రాజా

    ReplyDelete
  99. చిత్రం: మంచిమనుషులు
    గానం: బాలు
    సంగీతం: ఇళయరాజా

    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై "4"
    నిను కాన లేక మనసూరుకోక పాడాను నేను పాటనే "2"
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

    నువ్వక్కడ నేనిక్కడ
    పాటిక్కడ పలుకక్కడ
    మనసొక్కటి కలిసున్నది యేనాడైన {2)
    ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీకన్నులుగా
    నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
    ఊహల్లో తేలీ ఉర్రూతలూగీ మేఘాలతోటి రాగాల లేఖ
    నీకంపినాను రావా దేవి

    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై "2"
    నిను కాన లేక మనసూరుకోక పాడాను నేను పాటనై
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై

    నీ పేరోక జపమైనది నీ ప్రేమోక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఏన్నళ్ళైనా "2"
    ఉండీ లేకా వున్నది నీవే
    వున్నా కూడా లేనిది నేనే
    నా రేపటి అడియాసల రూపం నీవే
    దూరాన వున్నా నా తోడు నీవే
    నీ దగ్గరున్న నీ నీడ నాదే
    నాదన్నదంత నీవే నీవే

    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై "2"
    నిను కాన లేక మనసూరుకోక పాడాను నేను పాటనే
    జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
    వేచాను నీ రాకకై

    ReplyDelete
  100. కమ్మనీ ఈ ప్రేమలేఖనే రాసింది హృదయమే
    ప్రియతమా నీవచట కుశలమా
    నేనిచట కుశలమే
    ఊహలన్ని పాటలే కనులతోటలో
    తొలి కళల కవితలే మాట మాటలో
    ఓహో .. కమ్మనీ ఈ ప్రేమలేఖనే రాసింది ప్రియతమా

    ప్రియతమా....

    గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే
    మాయ చేసే ఆ మాయే ప్రేమాయే
    ఎంత గాయమైన గాని నా మేనికేమి గాదు
    పువ్వు సోకి నీకు సోకు కన్దేనే
    వెలికి రాని వెర్రి ప్రేమ
    కన్నీటి దారలోన కరుగుతున్నది
    నాడు శోకమోపలేక
    నీ గుండె బాధపడితే తాళనన్నది
    మనుశులెరుగలెరు మామూలు ప్రేమ కాదు
    అగ్ని కంటే స్వచ్చమైనది
    మమకారమే ఈ లాలి పాటగా
    రాసేది హృదయమా
    ఉమాదేవిగా శివుని అర్ధభాగమై
    నాలోన నిలువుమా
    శుభలాలి లాలి జో లాలి లాలి జో
    ఉమాదేవి లాలి లాలి జో లాలి లాలి జో
    మమకారమే ఈ లాలి పాటగా
    రాసేది హృదయమా
    నా హృదయమా

    చిత్రం : గుణ
    గానం : ఎస్.ఫై.బాలసుబ్రహ్మణ్యం, చిత్ర
    రచన : వెన్నెలకంటి
    సంగీతం : ఇళయరాజా

    ReplyDelete
  101. జ్యోతిగారు, ఇప్పుడు ఘంటసాల పాట. బాలు పాట కాదు.

    ReplyDelete
  102. సారీ.. చూసుకోలేదు..

    హే .. కృష్ణా.. ముకుందా.. మురారీ...
    జయ కృష్ణా ముకుందా మురారీ
    జయ గోవింద బృందావిహారీ
    II కృష్ణా II

    దేవకి పంట వసుదేవు వెంట
    యమునను నడిరేయి దాటితివంట
    వెలసితివంట నందుని ఇంట
    వ్రేపల్లె ఇల్లాయె నంటా - 2
    II కృష్ణా II

    నీ పలుగాకి పనులకు గోపెమ్మ - 2
    కోపించి నిను రోట బంధించెనంట
    ఊపున బోయి మాకుల గూలిచి - 2
    శాపాలు బాపితివంట
    II కృష్ణా II

    అమ్మా తమ్ముడు మన్ను తినేనూ
    చూడమ్మా అని రామన్న తెలుపగా
    అన్నా అని చెవి నులిమి యశోద
    ఏదన్నా నీ నోరు చూపుమనగా..
    చూపితివట నీ నోటను
    బాపురే పదునాల్గు
    భువన భాండమ్ముల
    ఆ రూపము గనిన యశోదకు
    తాపము నశియించి
    జన్మ ధన్యత గాంచెన్
    II జయ కృష్ణా II

    కాళీయ ఫణి ఫణ జాలాన ఝణ ఝణ
    కేళీఘటించిన గోప కిశోరా..- 2
    కంసాది దానవ గర్వాపహార -2
    హింసా విదూరా పాప విదారా
    II కృష్ణా II

    కస్తూరి తిలకం లలాట ఫలకే
    వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం
    కరతలే వేణుం కరే కంకణం
    సర్వాంగే హరి చందనంచ కలయం
    కంఠేచ ముక్తావళీమ్
    గోపస్త్రీ పరివేష్ఠితో
    విజయతే గోపాల్ చూడామణీ - 2

    లలిత లలిత మురళీస్వరాళీ - 2
    పులకిత వనపాలీ గోపాలీ
    పులకిత వనపాలీ
    విరలీకృత నవరాసకేలీ - 2
    వనమాలీ శిఖిపించమౌళి - 2
    II కృష్ణా II

    చిత్రం : పాండురంగ మహత్మ్యం
    గానం : ఘంటసాల
    రచన : సముద్రాల జూనియర్
    సంగీతం : టి.వి.రాజు

    ReplyDelete
  103. చిత్రం : శ్రీవారికి ప్రేమలేఖ
    సంగీతం : రమేష్ నాయుడు
    రచన : వేటూరి
    గానం : బాలు, జానకి

    లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ
    నీ కన్నుల కాటుక లేఖలలో
    నీ సొగసుల కవితా రేఖలలో
    ఇలా ఇలా చదవనీ నీ లేఖని ప్రణయ లేఖని
    బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖ
    నీ కౌగిట బిగిసిన స్వాశలతో
    నీ కవితలు నేర్పిన ప్రాసలతో
    ఇలా ఇలా రాయనీ నా లేఖని ప్రణయ రేఖని
    లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ

    అమావాశ్య నిశిలో కోటి తారలున్న ఆకాశం
    వెదుకుతు ఉంది వేదన తానై విదియ నాటి జాబిలి కోసం
    వెలుగునీడలెన్నున్నా వెలగలేని ఆకాశం
    ఎదుగుతు ఉందీ వెన్నెల తానై ఒక్కనాటి పున్నమి కోసం

    లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ

    అక్షరాల నీడలలో నీ జాడలు చూసుకుని
    ఆ పదాల అల్లికలో నీ పెదవులు అద్దుకుని
    నీ కంటికి పాపను నేనై నీ ఇంటికి వాకిలి నేనై
    గడప దాటలేక నన్నే గడియ వేసుకున్నాను
    గడియైనా నీవులేక గడపలేక ఉన్నాను

    బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమలేఖ
    నీ కౌగిట బిగిసిన స్వాసలతో
    నీ కవితలు నేర్పిన ప్రాసలతో
    ఇలా ఇలా రాయనీ నా లేఖని ప్రణయ రేఖని
    లిపి లేని కంటి బాస తెలిపింది చిలిపి ఆశ

    ReplyDelete
  104. శిలలపై శిల్పాలు చెక్కినారు శిలలపై శిల్పాలు చెక్కినారు
    మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు
    కను చూపు కరువైన వారికైనా కను చూపు కరువైన వారికైనా
    కనిపించి కనువిందు కలిగించు రీతిగా కను చూపు కరువైన వారికైనా
    ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు ఒకప్రక్క ఉరికించు యుద్ధ భేరీలు
    ఒకచెంప శృంగారమొలిగించు నాట్యాలు నవరసాలొలిగించు నగరానికొచ్హాము
    కనులు లేవని నీవు కలత పడవలదు కనులు లేవని నీవు కలత పడవలదు
    నా కనులు నీవిగా చేసికొని చూడు

    శిలలపై||

    ఏక శిల రధముపై లోకేశు ఒడిలోన ఓరచూపుల దేవి ఊరేగి రాగా
    రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమ పదనిస స్వరములే పాడగా
    కొంగు ముడి వేసుకొని క్రొత్త దంపతులు కొంగు ముడి వేసుకొని క్రొత్త దంపతులు
    కొడుకు పుట్టాలని కోరుతున్నారని

    శిలలపై||

    రాజులే పోయినా రాజ్యాలు కూలినా కాలాలు పోయినా గాల్పులే వీచినా
    మనుజులే దనుజులై మట్టి పాల్జేసినా అ......
    చెదరనీ కదలనీ శిల్పాలవలెనె నీవు నా హౄదయాన
    నిత్యమై సత్యమై నిలిచి వుందువు చెలి నిజమునా జాబిలి


    చిత్రం : మంచి మనసులు
    గానం : ఘంటసాల
    రచన : ఆత్రేయ
    సంగీతం: కె.వి.మహదేవన్

    ReplyDelete
  105. లేత చలిగాలులూ హోయి దోచుకోరాదురా
    మలివెలుగూ వెన్నెలలూ నిను తాకగా తగవురా.
    లేత చలిగాలులూ హోయి దోచుకోలేవులే
    మన వలపూ వాకిలిని అవి తాకగా లేవులే.

    చిత్రం:మూడు ముళ్ళు
    గానం:ఎస్.పి.బి.,సుశీల

    ReplyDelete
  106. ఈ పాటా ఇంతకముండు అయిపోయింది సునీత గారు..వచ్చిన పాట మళ్ళీ రాకూడదు కదా!!

    ReplyDelete
  107. లాలి జో లాలి జో ఊరుకో పాపాయీ
    పారిపోనీకుండా పట్టుకో నా చేయీ



    చిత్రం :ఇంద్రుడు-చంద్రుడు
    సాహిత్యం : తెలియదు
    సంగీతం తెలియదు
    పాడినవారు : బాలుగారు

    ReplyDelete
  108. ఇందుమూలముగా తెలియజేయునదేమనగా.. య బదులు ఎ, వాడొచ్చు అని.. :)))

    ఎవరికోసం ఈ మందహాసం .. ఒక పరి వివరించవే
    సొగసరీ … ఒక పరి వివరించవే
    చెలిమికోసం చెలి మందహాసం .. ఏమని వివరింతును
    గడుసరీ … ఏమని వివరింతును



    ఆ..ఆ… ఆ, వలపులు చినికే వగలాడి చూపు
    పిలువక పిలిచి విరహాలు రేపు
    ఆ..ఆ…ఆ.. ఎదలో మెదలే చెలికాని రూపు
    ఏవో తెలియని భావాల రేపు
    ఈ నయగారం ప్రేమసరాగం … ఈ నయగారం ప్రేమసరాగం
    అందించు అందరాని సంబరాలే … ఏ…ఏ….
    ఎవరికోసం ఈ మందహాసం .. ఒక పరి వివరించవే
    సొగసరీ … ఒక పరి వివరించవే



    ఆ..ఆ… ఆ, పరుగులు తీసే జవరాలి వయసు
    మెరుపై మెరసి మరపించు మనసు
    ఆ..ఆ… ఆ, ప్రణయం చిందే సరసాల గంధం
    ఇరువురినొకటిగ పెనవేయు బంధం
    ఈ వయ్యారం ఈ సింగారం … ఈ వయ్యారం ఈ సింగారం
    చిందించు చిన్ని చిన్ని వన్నెలెన్నో … ఓ…ఓ…
    ఎవరికోసం ఈ మందహాసం .. ఒక పరి వివరించవే
    సొగసరీ … ఒక పరి వివరించవే


    ఆ…ఆ… ఆ…చెలిమికోసం చెలి మందహాసం .. ఏమని వివరింతును
    గడుసరీ … ఏమని వివరింతును


    చిత్రం : నర్తనశాల
    గానం :ఘంటసాల, సుశీల
    రచన: శ్రీశ్రీ
    సంగీతం:సుసర్ల దక్షిణామూర్తి

    ReplyDelete
  109. చిత్రం - ప్రేమించు పెళ్ళాడు
    సంగీతం - ఇళయరాజా
    సాహిత్యం - వేటూరి
    గానం - బాలు, ఎస్.జానకి

    నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
    స్వరాలు సుమాలుగ పూచే..పదాలు ఫాలాలుగ పండె

    నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
    నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే

    హాయిగా పాటపాడే కోయిలే మాకు నేస్తం
    తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం
    నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం
    అలలపై నాట్యమాడే వెన్నెలే వేణు గానం

    ఆకసానికవి తారలా..
    ఆశకున్న విరిదారులా..
    ఈ సమయం ఉషోదయమై..మా హృదయం జ్వలిస్తుంటే

    నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
    స్వరాలు సుమాలుగ పూచే..పదాలు ఫాలాలుగ పండె
    నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే

    అగ్నిపత్రాలు రాసీ గ్రీష్మమే సాగిపోయే
    మెరుపులేఖలు రాసే మేఘమే మూగవోయే
    మంచు ధాన్యాలు కొలిచీ పౌష్యమే వెళ్ళిపోయే
    మాఘ దాహాలలోనా అందమే అత్తరాయే

    మల్లెకొమ్మ చిరునవ్వులా..
    మనసులోని మరు దివ్వెలా..
    ఈ సమయం రసోదయమై..మా ప్రణయం ఫలిస్తుంటే

    నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
    స్వరాలు సుమాలుగ పూచే..పదాలు ఫాలాలుగ పండె
    నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే

    ReplyDelete
  110. లేచింది నిద్ర లేచింది మహిళాలోకం
    దద్దరిల్లింది పురుష ప్రపంచం
    లేచింది మహిళాలోకం

    ఎపుడో చెప్పెను వేమనగారు
    అపుడే చెప్పెను బ్రహ్మంగారు
    ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా
    ఇపుడే చెబుతా ఇనుకో బుల్లెమ్మా
    విస్సన్న చెప్పిన వేదం కూడా
    లేచింది నిద్ర లేచింది మహిళాలోకం


    పల్లెటూళ్ళలొ పంచాయితీలు పట్టణాలలొ ఉద్యోగాలు
    అది ఇది ఏమని అన్ని రంగముల అది ఇది ఏమని అన్ని రంగముల
    మగధీరుల నెదిరించారు నిరుద్యోగులను పెంచారూ
    లేచింది నిద్ర లేచింది మహిళాలోకం


    చట్టసభలలొ సీట్ల కోసం భర్తలతోనే పోటీ చేసీ
    డిల్లీ సభలో పీఠం వేసీ
    డిల్లీ సభలో పీఠం వేసీ
    లెక్చరులెన్నో దంచారు
    విడాకు చట్టం తెచ్చారూ

    చిత్రం : గుండమ్మ కధ
    గానం: ఘంటసాల

    ReplyDelete
  111. జ్యోతి గారూ - ఈపాట అయిపోయిందండీ!!

    ReplyDelete
  112. సారీ చూసుకోలేదు.. :(

    ReplyDelete
  113. చిత్రం - పెంకిపెళ్ళాం
    గళం - ఘంటసాల
    సంగీతం - కె.ప్రసాదరావు
    రచన - తెలియదు


    లేదుసుమా లేదుసుమా
    అపజయమన్నది లేదుసుమా
    లేదుసుమా లేదుసుమా
    అపజయమనేది లేదుసుమా
    తోడు నీడ లేదని నీవు మానవ యత్నం మానకుమా
    అపజయమన్నది లేదుసుమా
    లేదుసుమా లేదుసుమా
    పాటే ఎక్కువ మానధనులకు
    పాటే ఎక్కువ మానధనులకు
    పాటు పడినచో లోటే రాదు
    పాటు పడినచో లోటే రాదు
    రెక్కలపైనే బ్రతికే వారు
    ఎక్కడనున్నా ఒకటె సుమా
    ఎక్కడనున్నా ఒకటె సుమా
    అపజయమన్నది లేదుసుమా
    లేదుసుమా లేదుసుమా
    అపజయమనేది లేదుసుమా
    నేడు నాటిన చిన్న మొలకలే
    నీడనొసంగును ఒక నాడు
    నేడు నాటిన చిన్న మొలకలే
    నీడనొసంగును ఒక నాడు
    నవ్విన వూర్లే పట్నాలవురా
    నవ్విన వూర్లే పట్నాలవురా
    సస్యే ఫలే అని మరచిపోకురా
    సస్యే ఫలే మరచిపోకురా
    లేదుసుమా లేదుసుమా
    అపజయమన్నది లేదుసుమా
    తోడు నీడ లేదని నీవు మానవ యత్నం మానకుమా
    అపజయమన్నది లేదుసుమా
    అపజయమన్నది లేదుసుమా

    ReplyDelete
  114. పాట - మెరుపులా మెరిసావూ
    చిత్రం - ప్రేమ సంకెళ్ళు
    సంగీతం - రమేష్ నాయుడు
    రచన - వేటూరి
    మెరుపులా మెరిసావు వలపులా కలిసావు
    కన్ను తెరిచి చూసేలొగా
    నిన్నలలో నిలిచావు నిన్నలలో నిలిచావు

    మల్లెల కన్నీరు చూడు మంచులా కురిసింది
    లేత ఎండల నీడలలో నీ నవ్వే కనిపించింది
    వేసారినా బాటలలొ వేసవి నిట్టూర్పులలో
    వేసారినా బాటలలొ వేసవి నిట్టూర్పులలో
    దొసిట నా ఆశలన్నీ దోచి వెళ్ళిపొయావు

    ప్రాణాలన్ని నీకై చలి వేణువైనాయీ
    ఊపిరి ఉయాలూగే ఎదే మూగ సన్నాయి
    పసుపైనా కానీవా పదాలంటుకొనీవా పాదాలకు
    పారాణై పరవశించిపొనీవా పలకరించిపొలెవా

    వెకువంటి చీకటి మీద చందమామ జారింది
    నీవు లేని వేదనలొనే నిశిరాతిరి నిట్టూర్చింది
    తెల్లారని రాతిరిలా వెకువలో వెన్నెలలా
    తెల్లారని రాతిరిలా వెకువలో వెన్నెలలా
    జ్ణపకాల వెళ్ళువలోనే కరిగి చెరిగి పొతున్నాను

    ReplyDelete
  115. నిన్న లేని అందమేదో :పాట

    చిత్రం : పునర్జన్మ

    పాడినవారు :ఘంటసాల

    ReplyDelete
  116. దొరకునా దొరకునా దొరకునా
    దొరకునా ఇటువంటి సేవ
    దొరకునా ఇటువంటి సేవ
    నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ
    దొరకునా ఇటువంటి సేవ
    నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ
    దొరకునా ఇటువంటి సేవ


    రాగాలనంతాలు నీవేయి రూపాలు
    భవరోగ తిమిరాల ఓకార్చు దీపాలు
    రాగాలనంతాలు నీవేయి రూపాలు
    భవరోగ తిమిరాల ఓకార్చు దీపాలు
    నాదాత్మకుడవై నాలోన చెలగి
    నా ప్రాణ దీపమై నాలోన వెలిగే
    నాదత్మకుడవై నాలోన చెలగి
    నా ప్రాణ దీపమై నాలోన వెలిగే
    నిను కొల్చువేళ దేవాది దేవ దేవాది దేవ

    దొరకునా ఇటువంటి సేవ
    నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ
    దొరకునా ఇటువంటి సేవ

    ఉచ్వాస నిశ్వాసములు వాయు లీనాలు
    స్పందించు నవనాడులే వీణా గానాలు
    నడలు ఎదలోని సడులే మృదంగాలు
    ఉచ్వాస నిశ్వాసములు వాయు లీనాలు
    స్పందించు నవనాడులే వీణా గానాలు
    నడలు ఎదలోని సడులే మృదంగాలు
    నాలోని జీవమై నాకున్న దైవమై వెలుగొందు వేళ
    మహానుభావా మహానుభావా

    దొరకునా ఇటువంటి సేవ
    నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ
    దొరకునా ఇటువంటి సేవ

    చిత్రం : శంకరాభరణం
    గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
    సంగీతం: కె.వి.మహదేవన్

    ReplyDelete
  117. మందాకిని గారు, మరీ ఒక లైను ఏంటండీ? పాటకి మొట్టమొదటి చరణం ఉండి తీరాలి అని కదా...ధన్యవాద్ హా!!

    ReplyDelete
  118. పాట - వగల రాణివి నీవే, సొగసుకాడను నేనే ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే.
    సాహిత్యం - సి.నారాయణరెడ్డి
    సంగీతం, గళం - ఘంటసాల


    వగల రాణివి నీవె సొగసుకాడను నేనె
    ఈడు కుదిరెను జోడు కుదిరెనూ మేడ దిగి రావె
    వగల రాణివి నీవె సొగసుకాడను నేనె

    ఈడు కుదిరెను జోడు కుదిరెనూ మేడ దిగి రావె
    పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం
    పిండి వెన్నెల నీ కోసం పిల్ల తెమ్మెర నా కోసం
    రెండు కలసిన నిండు పున్నమి రేయి మన కోసం
    వగల రాణివి నీవె

    దోర వయసూ చినదానా కోర చూపుల నెరజాణ
    దోర వయసూ చినదానా కోర చూపుల నెరజాణ
    బెదరుటెందుకు కదులు ముందుకు ప్రియుడనేగానా
    వగల రాణివి నీవె

    కోపమంతా పైపైనే చూపులన్నీ నాపైనే
    కోపమంతా పైపైనే చూపులన్నీ నాపైనే
    వరుని కౌగిట ఒరిగినంతట కరగి పోదువులె
    వగల రాణివి నీవె సొగసుకాడను నేనె
    ఈడు కుదిరెను జోడు కుదిరెనూ మేడ దిగి రావె
    వగల రాణివి నీవె సొగసుకాడను నేనె

    ReplyDelete
  119. నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
    అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ
    భావములో ఆ.. భంగిమలో ఆ.. గానములో ఆ.. గమకములో ఆ...
    భావములో భంగిమలో గానములో గమకములోఆంగికమౌ తపమీ గతి సేయ
    నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
    అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ
    ఆ..ఆ..ఆ......... !!

    కైలాసాన కార్తీకాన శివ రూపం
    ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
    కైలాసాన కార్తీకాన శివ రూపం
    ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం
    నవరస నటనం .. ద ని స రి స ని స
    జతియుత గమనం .. ద ని స రి స ని స
    నవరస నటనం జతియుత గమనం
    సితగిరి చలనం సురనది పయనం
    భరతమైన నాట్యం .. ఆ....
    బ్రతుకు నిత్య నృత్యం .. ఆ
    భరతమైన నాట్యం .. ఆ....
    బ్రతుకు నిత్య నృత్యం .. ఆ
    తపనుని కిరణం తామస హరణం
    తపనుని కిరణం తామస హరణం
    శివుని నయన త్రయలాశ్యం
    ధిరన ధిరననన తకిట తకిటతధిమి
    ధిరన ధిరననన నాట్యం
    ధిరన ధిరననన తకిట తకిటతధిమి
    ధిరన ధిరననన లాస్యం
    నమక చమక సహజం ..ఝం
    నటప్రకృతీ పాదజం .. ఝం
    నర్తనమే శివకవచం .. చం
    నటరాజ పాద సుమరజం .. ఝం
    ధిరనన ధిరనన ధిరనన ధిరననధిర ధిర ధిర ధిర ధిర ధిర..
    నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము
    అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదమూ ఆ..ఆ..ఆ !!

    చిత్రం : సాగరసంగమం
    గానం: ఎస్.పి.బాలసుబ్రమణ్యం, ఎస్.పి.శైలజ
    సంగీతం: ఇళయరాజా

    ReplyDelete
  120. చిత్ర౦:చదువుకున్న అమ్మాయిలు గాన౦:ఘ౦టసాల,సుశీల



    ఆడవాళ్ళ కోపంలో అందమున్నది ఆహ

    అందులోనె అంతులేని అర్థమున్నదీ

    అర్థమున్నది

    మొదటిరోజు కోపం అదో రకం శాపం

    పోను పోను కలుగుతుంది బలే విరహ తాపం



    బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు

    తన మాటలందు చేతలందు పొత్తు కుదరదూ

    పొత్తు కుదరదు



    పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం

    ఒక గడుసు పిల్ల కసరగానె లోన లుటారం

    పడుచువాడీ...ఓహో (పడుచు)



    వగలాడి తీపి తిట్టు తొలి వలపు తేనె పట్టు

    ఆ తేనె కోరి చెంతజేర చెడామడా కుట్టు

    (బ్రహ్మ)



    పెళ్ళికాని వయసులోని పెంకిపిల్లలూ ఓహో

    కళ్ళతోనె మంతనాలు చేయుచుందురు

    పెళ్ళికాని వయసులోని పెంకిపిల్లలూ

    తమ కళ్ళతోనె మంతనాలు చేయుచుందురు

    వేడుకొన్న రోసం అది పైకి పగటివేశం

    వెంటపడిన వీపు విమానం (ఆడవాళ్ళ)



    చిలిపి కన్నె హృదయమెంతొ చిత్రమైనదీ

    అది చిక్కు పెట్టు క్రాసువరుడు పజిలు వంటిది

    చిలిపి కన్నే ............(చిలిపి)

    ఆ పజిలు పూర్తి చేయి

    తగు ఫలితముండునోయి

    మరుపురాని మధురమైన ప్రైజు దొరుకునోయి

    (ఆడవాళ్ళ)

    (బ్రహ్మచారి)






    EDIT

    ReplyDelete
  121. పొత్తు కుదరదు.చివరి అక్షర౦ ద.

    ReplyDelete
  122. ఈ పాదం పుణ్యపాదం ఈ పాదం దివ్యపాదం ప్రణవ మూల నాదం
    ప్రథమలోకపాదం ప్రణతులే చేయలేని ఈ తరమేల ఈ కరమేల
    ఈ పాదం పుణ్యపాదం ధరనేలే ధర్మపాదం

    మార్కండేయ రక్షపాదం మహాపాదం ఆ...
    భక్తకన్నప్ప కన్న పరమపాదం భాగ్యపదం
    ఆత్మలింగ సయంపూర్ణ ఆత్మలింగ స్వంపూర్ణుడే సాక్షాత్కరించినా
    చేయూతవీడినా అయ్యో అందని అనాధనైతి మంజునాధా
    ఈ పాదం పుణ్యపదం ధరనేలే ధర్మపదం
    ప్రణయమూల పాదం ప్రళయ నాట్యపాదం
    ప్రణతులే చేయలేని ఈ శిరమేల ఈ బ్రతుకేల

    భక్త శిరియాళు నేలిన హేమపాదం
    బ్రహ్మ విష్ణులే భుజించే ఆదిపాదం అనాదిపాదం
    అన్నదాత విశ్వదాత లీలా వినోదిగా
    నన్నేలగా దిగిరాగా అయ్యో చీ
    పొమ్మంటి నే పాసినై తినే ఈ పాదం పుణ్యపాదం ఈపాదం
    ధర్మపాదం
    సకల ప్రాణపాదం సర్వమోక్ష పాదం
    తెలుసుకోలేని నా ఈ తెలివేల ఈ తనువేల


    చిత్రం : శ్రీ మంజునాధా
    గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం

    ReplyDelete
  123. లాహిరి లాహిరి లాహిరిలో
    ఓహో! జగమే ఊగెనుగా
    ఊగెనుగా తూగెనుగా

    తారాచంద్రుల విలాసములతో
    విరిసే వెన్నెల పరవడిలో ఉరవడిలో
    తారాచంద్రుల విలాసములతో
    విరిసే వెన్నెల పరవడిలో
    పూల వలపుతో ఘుమఘుమలాడే
    పిల్ల వాయువుల లాలనలో

    ll లాహిరి ll

    అలల ఊపులో తీయని తలపులు
    చెలరేగే ఈ కలకలలో మిలమిలలో
    అలల ఊపులో తీయని తలుపులు
    చెలరేగే ఈ కలకలలో
    మైమరపించే ప్రేమనౌకలో
    హాయిగ చేసే విహరణలో

    ll లాహిరి ll

    రసమయ జగమును రాసక్రీడకు
    ఉసిగొలిపే ఈ మధురిమలో మధురిమలో
    రసమయ జగమును రాసక్రీడకు
    ఉసిగొలిపే ఈ మధురిమలో
    ఎల్లరి మనములు ఝల్లన జేసే
    చల్లని దేవుని అల్లరిలో

    ll లాహిరి ll

    చిత్రం : మాయాబజార్
    గానం : ఘంటసాల, పి.లీల

    ReplyDelete
  124. మందాకిని గారూ!! మీరు పప్పులో కలేసారోచ్. ఈపాట ఇంతకముందే అయిపోయిందోచ్.

    ReplyDelete
  125. చిత్రం - కంచుకోట
    సంగీతం - కె.వి.మహదేవన్
    సాహిత్యం - ఆచార్య ఆత్రేయ
    గళం - ఘంటసాల మరియూ పి.సుశీల

    లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు
    ఇలా ఉరకలు వేస్తావు నీలో ఉన్నది దాస్తావు

    ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
    లేని దానిని చేస్తావు నాలో ఉన్నది దోస్తావు

    కొండ వాగుల కొంటె తనాల దూకుడు నీలో ఉంది
    నల్లని జడలో కరినాగుంది నడకలలో అది కనబడుతుంది

    లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు

    కళ్ళు మూసి నిదురపోతే కలలు రాని వేళే లేదు
    కలలో కొచ్చి కబురులు చెప్పే జతగాడైనా లేడు
    జతగాడైనా లేడు

    ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు

    దోర మాగిన దొండపండు నీ బుగ్గ సిగ్గులో ఉంది
    మొగిలి రేకుల సొగసూ ఉంది మొన కన్నులలో పదునూ ఉంది

    లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు

    వెన్నెలొచ్చినా మంచు కురిసినా వేడి తగ్గటం లేనే లేదు
    అద్దములోన అందం చూస్తే నిద్దర రానే రాదు నిద్దర రానే రాదు

    ఉంది ఉందని ఎందుకు నాలో ఉన్నది దోస్తావు
    లేని దానిని చేస్తావు నాలో ఉన్నది దోస్తావు

    ReplyDelete
  126. నేను ఈ పాట ఆల్రెడీ చెప్పేశానుగా :)

    ReplyDelete
  127. భవానీ గారు -నిజమే సుమా!! నేను గమనించనేలేదు.

    ReplyDelete
  128. జ్యోతి గారు, "ల" తో ఇంకేమీ పాటలు దొరకలేదు, కిం కర్తవ్యం?

    ReplyDelete
  129. పర్లేదు భాస్కర్ గారు, మీరే ఇంకో అక్షరం చెప్పండి. పాట ఇవ్వొద్దు. ఛాన్స్ వేరేవాళ్లకి..

    ReplyDelete
  130. ల ముందున్న అక్షరం తీసుకొని పాడితే?...
    ఎలా ఉంటుంది?

    ReplyDelete
  131. భవానీజీ!! లేటుగా ఐనే లేటెస్టుగా చెప్పారు....అత్భుతం. అలాక్కానిద్దాం.

    ReplyDelete
  132. రవి వర్మకే అందని ఒకే ఒక అందానివో
    రవి చూడని పాడని నవ్య రాగానివో

    II రవి వర్మకే II

    ఏ రాగమో తీగదాటి ఒంటిగా నిలిచే
    ఎ యొగమో నన్ను దాటి జంటగా పిలిచే
    ఏ మూగభావాలో అనురాగ యోగాలై
    ఆ.. ఆ.
    నీ పాటనే పాడనీ
    II రవి వర్మకే II

    ఏ గగనమో కురులు జారి నీలిమై పోయే
    ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే
    ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై
    ఆ .. ఆ..
    కదలాడనీ పాడనీ
    II రవి వర్మకే II

    చిత్రం : రావణుడే రాముడైతే
    గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి
    రచన : వేటూరి
    సంగీతం : జి.కె.వెంకటేశ్

    ReplyDelete
  133. జ్యోతి గారూ - మీ ఇంతకముందటి పాట
    చివరి లైను "తెలుసుకోలేని నా ఈ తెలివేల ఈ తనువేల"
    ల తో పాటలు లేవ్య్ కాబట్టి వ తోటి మొదలుపెట్టాలి ఐతే అది బాలు పాట కాబట్టి ఇప్పుడు రావాల్సింది ఘంటసాల గారి పాట

    ReplyDelete
  134. నాపాట ఎందుకని మందాకినిగారి పాట తీసుకున్నా.. సారీలు..

    వేషము మార్చెను... హోయ్!
    భాషను మార్చెను... హోయ్!
    మోసము నేర్చెన్....
    అసలు తానే మారెను...
    అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!
    మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!

    క్రూరమృగమ్ముల కోరలు తీసెను, ఘోరారణ్యములాక్రమించెను (2)
    హిమాలయముపై జండా పాతెను, (2) ఆకాశంలో షికారు చేసెను
    అయినా మనిషి మారలేదు, ఆతని కాంక్ష తీరలేదు!

    పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను (2)
    వేదికలెక్కెను, వాదము చేసెను, (2) త్యాగమె మేలని బోధలు చేసెను
    అయినా మనిషి మారలేదు, ఆతని బాధ తీరలేదు!

    వేషమూ మార్చెను, భాషనూ మార్చెను,
    మోసము నేర్చెను, తలలే మార్చెను...
    అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు!

    ఆ...ఆహహాహాహ ఆహాహహా...
    ఓ... ఓహొహోహోహో ఓహోహొహో...

    చిత్రం : గుండమ్మ కథ
    గానం : ఘంటసాల, పి.సుశీల
    రచన : పింగళి
    సంగీతం : ఘంటసాల

    ReplyDelete
  135. చిత్రం - జయం మనదే
    గళం - ఘంటసాల, జిక్కి మరియూ బృదం
    రచన - తెలియదు
    సంగీతం - ఘంటసాల

    వస్తుందోయ్ వస్తుంది
    వస్తుందోయ్ వస్తుంది
    కారే పేదల చెమట యేరులై కబళించే రోజొస్తుందోయ్ వస్తుంది
    వస్తుందోయ్ వస్తుంది
    వస్తుందోయ్ వస్తుంది
    ఈ చెమటే రేపింతై అంతై తేరి చూడ రానంత తీవ్రమై
    ఈ చెమటే రేపింతై అంతై తేరి చూడ రానంత తీవ్రమై
    తుఫాను రూపై ధూము ధాములతో
    తుఫాను రూపై ధూము ధాములతో
    ప్రపంచాన్ని కదలించే రోజు వస్తుందోయ్ వస్తుంది
    వస్తుందోయ్ వస్తుంది
    వస్తుందోయ్ వస్తుంది

    కూటికి గుడ్డకు కుమిలేవాళ్ళను పూరిగుడిసెలను పొర్లేవాళ్ళను
    కూటికి గుడ్డకు కుమిలేవాళ్ళను పూరిగుడిసెలను పొర్లేవాళ్ళను
    గర్భదరిద్రుల నుద్ధరించుటకు
    గర్భదరిద్రుల నుద్ధరించుటకు
    దేవుడు తానై దిగి వచ్చే
    రోజొస్తుందోయ్ వస్తుందోయ్
    వస్తుందోయ్ వస్తుంది
    వస్తుందోయ్ వస్తుంది

    ఆలోచించి లాభం లేదు అవతల మొర్రో యన్నా లేదు
    ఆలోచించి లాభం లేదు అవతల మొర్రో యన్నా లేదు
    కొంపలు భగభగ మండేటప్పుడు నూతులు తవ్వి ఫలితం లేదు
    వస్తుందోయ్ వస్తుంది
    వస్తుందోయ్ వస్తుంది


    అందరు దేవుని బిడ్డలె యంటూ అందరు అన్నలు తంమ్ములె యంటూ
    అందరు దేవుని బిడ్డలె యంటూ అందరు అన్నలు తంమ్ములె యంటూ
    అనురాగం చూపించకపోతే అసూయ పెరిగి విశము గ్రక్కు రోజు
    వస్తుందోయ్ వస్తుంది
    కారే పేదల చెమట యేరులై కబళించే రోజొస్తుందోయ్ వస్తుంది
    చక చక చక వస్తుందోయ్
    గబ గబ గబ వస్తుందోయ్ వస్తుంది
    వస్తుందోయ్ వస్తుంది

    ReplyDelete
  136. దొరకునా దొరకునా దొరకునా
    దొరకునా ఇటువంటి సేవ
    దొరకునా ఇటువంటి సేవ
    నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ
    దొరకునా ఇటువంటి సేవ
    నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ
    దొరకునా ఇటువంటి సేవ


    రాగాలనంతాలు నీవేయి రూపాలు
    భవరోగ తిమిరాల ఓకార్చు దీపాలు
    రాగాలనంతాలు నీవేయి రూపాలు
    భవరోగ తిమిరాల ఓకార్చు దీపాలు
    నాదాత్మకుడవై నాలోన చెలగి
    నా ప్రాణ దీపమై నాలోన వెలిగే
    నాదత్మకుడవై నాలోన చెలగి
    నా ప్రాణ దీపమై నాలోన వెలిగే
    నిను కొల్చువేళ దేవాది దేవ దేవాది దేవ

    దొరకునా ఇటువంటి సేవ
    నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ
    దొరకునా ఇటువంటి సేవ

    ఉచ్వాస నిశ్వాసములు వాయు లీనాలు
    స్పందించు నవనాడులే వీణా గానాలు
    నడలు ఎదలోని సడులే మృదంగాలు
    ఉచ్వాస నిశ్వాసములు వాయు లీనాలు
    స్పందించు నవనాడులే వీణా గానాలు
    నడలు ఎదలోని సడులే మృదంగాలు
    నాలోని జీవమై నాకున్న దైవమై వెలుగొందు వేళ
    మహానుభావా మహానుభావా

    దొరకునా ఇటువంటి సేవ
    నీ పద రాజీవముల చేరు నిర్వాణ సొపానమదిరోహనము సేయు త్రోవ
    దొరకునా ఇటువంటి సేవ

    చిత్రం : శంకరాభరణం
    గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
    సంగీతం: కె.వి.మహదేవన్

    ReplyDelete
  137. చిత్రం - భట్టి విక్రమార్క
    రచన - అనిసెట్టి సుబ్బారావు
    సంగీతం - పెండ్యాల నాగేశ్వరరావు
    పాడినవారు -శ్రీ ఘంటసాల, పి.సుశీల

    ఓ నెలరాజా వెన్నెలరాజా నీ వన్నెలన్ని చిన్నెలన్నీ మాకేలోయ్
    మా వెన్నుతట్టి పిలిచింది నీవేనోయ్
    ఓ నెలరాజా

    చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో
    ఓ...చల్లగాలి జాడలో తెల్లమబ్బు నీడలో
    కొంటెచూపు నీకేల చంద్రుడా
    నా వెంటనంటి రాకోయి చంద్రుడా
    ఓ నెలరాజా వెన్నెలరాజా నీ వన్నెలన్ని చిన్నెలన్నీ మాకేలోయ్
    మా వెన్నుతట్టి పిలిచింది నీవేనోయ్
    ఓ నెలరాజా

    కలువల చిరునవ్వులే కన్నెల నును సిగ్గులే
    ఓ ... కలువల చిరునవ్వులే కన్నెల నును సిగ్గులే
    వెంటనంటి పిలిచినపుడు చంద్రుడా
    వాని విడువమనకు తరమౌనా చంద్రుడా
    ఓ నెలరాజా వెన్నెలరాజా నీ వన్నెలన్ని చిన్నెలన్నీ మాకేలోయ్
    మా వెన్నుతట్టి పిలిచింది నీవేనోయ్
    ఓ నెలరాజా

    లేతలేత వలపులే పూతపూయు వేళలో
    కలవరింతలెందుకోయి చంద్రుడా
    నా చెలిమి నీదెకాదటోయి చంద్రుడా
    కలవరింతలెందుకోయి చంద్రుడా
    నా చెలిమి నీదెకాదటోయి చంద్రుడా
    ఓ నెలరాజా వెన్నెలరాజా నీ వన్నెలన్ని చిన్నెలన్నీ మాకేలోయ్
    మా వెన్నుతట్టి పిలిచింది నీవేనోయ్
    ఓ నెలరాజా

    ReplyDelete
  138. జ, ఝ చలేగా :)

    ఝుమ్మంది నాదం సైయ్యంది పాదం
    తనువూగింది ఈ వేళ
    చెలరేగింది ఒక రాసలీలా
    ఝుమ్మంది నాదం సైయ్యంది పాదం
    తనువూగింది ఈ వేళా
    చెలరేగింది ఒక రాసలీల

    యెదలోని సొదలా ఎల యేటి రొదలా
    కదిలేటి నదిలా కలల వరదలా
    యెదలోని సొదలా ఎల యేటి రొదలా
    కదిలేటి నదిలా కలల వరదలా
    చలిత లలిత పద కలిత కవిత లుగ
    సరిగమ పలికించగా
    స్వర మధురిమ లొలికించగా
    సిరిసిరి మువ్వలు పులకించగా

    ఝుమ్మంది ||

    నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి
    నటియించు నీవని తెలిసీ
    నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి
    నటియించు నీవని తెలిసీ
    ఆకాశమై పొంగె ఆవేశం
    కైలాసమే వంగె నీకోసం

    ఝుమ్మంది ||

    మెరుపుంది నాలో - అది నీ మేని విరుపు
    ఉరుముంది నాలో - అది నీ మువ్వ పిలుపు
    చినుకు చినుకులో చిందు లయలతో
    కురిసింది తొలకరి జల్లు
    విరిసింది అందాల హరివిల్లు
    ఈ పొంగులే ఏడు రంగులుగా

    ఝుమ్మంది ||


    చిత్రం : సిరిసిరిమువ్వ
    గానం : పి.సుశీల,ఎస్.పి.బాలసుబ్రమణ్యం
    రచన : వేటూరీ
    సంగీతం:కె.వి.మహదేవన్

    ReplyDelete
  139. దాచాలంటే దాగదులే
    దాగుడు మూతలు సాగవులే
    వలపుల సంకిలి బిగిసే దాకా
    వదలను వదలను వదలనులే

    చిత్రం : లక్షాధికారి
    రాత : సినారె
    సంగీతం: టి. చలపతిరావు
    పాట : సుశీల, ఘంటసాల

    ReplyDelete
  140. జ్యొతి గారు

    అన్ని రెండుసార్లు రాస్తున్నారేమిటి?

    దొరకునా పాట,వేషము మార్చెను పాటలు

    ReplyDelete
  141. చిత్రం - సూత్రధారులు
    పాడినవారు - బాలసుబ్రహ్మణ్యం, శైలజ
    సాహిత్యం - సినారె
    సంగీతం కె.వి మహదేవన్

    లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో
    లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో
    మూడుబుఱుజుల కోట ముత్యాల తోట
    ముంగిట్లో చిన్నారి బావకు మురిపాల తీట
    మూడుబుఱుజుల కోటా ముత్యాల తోట
    సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట
    లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో
    లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో

    ఓఓఓ ఇంతలేసి కళ్ళున్న ఇంతి మనసు చేమంతా ముద్దబంతా చెప్పరాదా చిగురంత
    ఇంతలోనె చెప్పుకుంటె కొంటె వయసు అన్నన్నా వదిలేనా నన్నైనా నిన్నైనా
    ఇంతలేసి కళ్ళున్న ఇంతి మనసు చేమంతా ముద్దబంతా చెప్పరాదా చిగురంత
    ఇంతలోనె చెప్పుకుంటె కొంటె వయసు అన్నన్నా వదిలేనా నన్నైనా నిన్నైనా
    కిన్నెడల్లె కన్నె పరువం కన్ను గీటి కవ్విస్తే
    ఉన్నవేడి ఉప్పెనల్లే ఉరకలేసి ఊరిస్తే

    లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో
    లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో

    గడుసుగాలి పడుచుమొగ్గ తడిమిపోతే కాయునా పండౌనా కామదేవునీ పండగౌనా
    కాముడై లగ్గమెట్టి కబురుపెడితే వారమేల వర్జమేల వల్లమాలినా వంకలేల
    గడుసుగాలి పడుచుమొగ్గ తడిమిపోతే కాయునా పండౌనా కామదేవునీ పండగౌనా
    కాముడై లగ్గమెట్టి కబురుపెడితే వారమేల వర్జమేల వల్లమాలినా వంకలేల
    ముసురుకున్న ముద్దులన్నీ మూడుముళ్ళ గుత్తులైతే
    కలవరించు పొద్దులన్ని కాగిపొయ్యి కౌగిలైతే

    మూడుబుఱుజుల కోటా ముత్యాల తోట
    సందిట్లో వయ్యారి మరదలికి సరసాల మూట
    లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో
    లాలేలో లిల్లేలేలో రామ రామ ఉయ్యాల అమ్మలాలో

    అందించిన వారు శక్తి

    ReplyDelete
  142. అంతా బానే ఉంది గానీండి మరి సొలో పాటల మధ్యన డ్యుయట్స్ పెట్టేస్తే ఎలాగండీ? మీరు మొదట్లో ఒక ఘంటసాల,ఒక యస్.పి.బి.పాట అన్నారు కదా?డ్యుయట్స్ కలిపేస్తే మజా ఏముంటుందండి?సొలొస్ ఒకతే అయితేనే ఆటకి పట్టు ఉంటుందని నా అభిప్రాయం.ఏమంటారు?

    ReplyDelete
  143. కేవలం డ్యూయట్లే అంటే దొరకచ్చు, దొరక్కపోనూ వచ్చు..
    ఏమంటారూ??

    ReplyDelete
  144. మీరు ఘంటసాల,బాలూ పాడినవి అన్నారు కదండి..అవి సోలొ పాటలైటే బాగుంతాయి ఒక చోత పెట్టడానికి.
    తరువాత ద్యూయెట్స్ రౌండ్ పెట్టాల్సింది.విడి విడిగా రెండు రౌండ్లు పెడితే ,తరువాత ఒక చోట పొందుపరచటానికి బాగుంటుందని నా అభిప్రాయం.ఈ ఆట సాగిపొతోంది కాబట్టి,
    మీరు ఆడియో సంపాదించి లిస్ట్ పెట్టేప్పుడైనా అలా వాళ్ళిద్దరే పాడిన సోలోలు విడిగా,డ్యూయెట్లు విడిగా పెడితే బాగుంటుంది.అలోచించండి.
    నేను రెకార్డ్ చేయించుకునేప్పుడు అలా చేయించుకునే దాన్ని.మలె సొలొస్,అలా!male solos,female solos,duets,అలా!సరే మరి నేను ఒక చెయ్యి వేస్తాను మీ ఆటలో..

    ReplyDelete
  145. చిత్రం:గుండమ్మ కధ
    పాడినది:ఘంటసాల
    సంగితం:ఘంటసాల
    రచన:పింగళి నాగేశ్వర రావు

    లేచింది నిద్ర లేచింది మహిళా లోకం..దద్దరిల్లింది పురుషప్రపంచం...

    sorry,not able to write the full song.

    ReplyDelete
  146. తృష్ణాజీ!! ఈ పాట ఇంతక మునుపే వాడేసాం!! పప్పులో కలేసేసారు మీరు.

    ReplyDelete
  147. ఈసారి ఒక డ్యూయెట్ రాస్తున్నను:
    చిత్రం:అగ్గిపిడుగు
    సంగీతం: రాజన్ నాగేంద్ర
    male singer is ghantasaala, female singer must be s.janaki or L.R.eeswari.
    పాట:
    లడ్దు లడ్డు లడ్డు ..బందరు మిఠాయి లడ్డు..
    బూందీ లడ్డు..కోవా లడ్డు..రవ్వా లడ్డూ..
    see the song link here:
    http://www.youtube.com/watch?v=tRZu8lIH15Y

    ReplyDelete
  148. namastE..bhaaskar gaaru ___/\___

    O.....my....God.....enni Comments

    idEnTii antyaksharinaa?

    nEnU ADochchaa?

    bhaaskar gaarU nEnu evarO telusaa?

    ReplyDelete
  149. నమస్తే
    మీరూ ఆడొచ్చు.
    ఎవరు మీరు? నేను మీకు తెలుసా? మీరు నాకు తెలుసా?

    ReplyDelete
  150. hahaha nEnu gurtu lenanduku chintistunnaanu:(

    nEnu sunderpriya ni :)

    www.mynewtelugusongs.blogspot.com

    site lo meeto chat chesinadaanni gurtu vachchaanaa:)

    ReplyDelete
  151. భలేవాళ్ళే మీరు!! :):)
    నేనింకా మీది మావూరేనేమో, లేక ఇంకెక్కడైనా పరిచయమేమో, ఇలా ఆలోచిస్తున్నా.

    ReplyDelete
  152. gurtu vachchaanaa?

    mee BLOG link naa BLOG lO pettaanu chusaaraandii ?

    ReplyDelete
  153. మా ఊరేమో అంటే ఒక పాట గుర్తుకొచ్చిందండీ

    " ఏ ఊరు...ఏ వాడ..అందగాడా..మా ఊరు వచ్చావు పిల్లగాడా"

    నాకు బాగా ఇష్టమైన పాటలేండి :)

    ReplyDelete
  154. ఒకసారి చూస్తే మర్చిపోను. కాబట్టి గుర్తు ఉన్నారు!!:):)

    ReplyDelete
  155. మంచిపాటే!!
    ఇక ఆలశ్యం దేనికి..అంత్యాక్షరీని కొనసాగించండి..

    ReplyDelete
  156. antyaksharii ante elaa??

    pallavi maatramE naa lEkunTE paaTantaa raayaalaa??

    ReplyDelete
  157. okka nimushamanDi ippuDE vastaanu

    ReplyDelete
  158. ప్రతీ పాటకీ తప్పనిసరిగా ఇవి ఉండాలి: పాడినవారు, ఏ చిత్రం, రాసింది ఎవరు, సంగీతం ఎవరు, మొట్టమొదటి చరణం (ఒకవేళ్ల పాటకి ముందు ఇంట్రో ఉంటే అంత్యాక్షరం దానితో మొదలుకావాలి).
    ఇక, పాట మొత్తం అందించగలిగితే భేష్

    ReplyDelete
  159. ఫిల్మ్!!అక్బర్ సలీం అనార్కలి!!1979
    సంగీతం::C.రామ చంద్ర
    రచన::C.నారాయణ రెడ్డి
    గానం::P.సుశీల,మొహమద్ రఫి


    సిపాయీ సిపాయీ..
    సిపాయీ సిపాయీ..
    నీకై ఎంత ఎంత వేచి వేచి వున్నానో
    ఈ వాలుకనుల నడుగు అడుగు చెపుతాయీ
    సిపాయీ..ఓ..సిపాయీ

    హసీనా హసీనా
    హసీనా హసీనా
    నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
    ఈ పూల మనసునడుగు అడుగు ఇకనైనా
    హసీనా..ఓ..హసీనా

    జడలోని మల్లెలు జారితే
    నీ ఒడిలో ఉన్నాననుకొన్నా..
    చిరుగాలిలో కురులూగితే
    చిరుగాలిలో కురులూగితే
    నీ చేయి సోకెనని అనుకొన్నా..

    ఆ...మల్లెలలో కదలాడినవి
    నా కలవరింపులే..
    ఆ గాలిలో చెలరేగినవి
    ఆ గాలిలో చెలరేగినవి
    నా నిట్టూరుపులే...

    హసీనా..ఓ..హసీనా
    నీకై ఎంత ఎంత వేచి వేచి ఉన్నానో
    ఈ వాలు కనుల నడుగు అడుగు చెపుతాయీ
    సిపాయీ..ఓ..సిపాయీ

    గడియిసుకలో గీసిన గీతలు
    అలతాకితే మాసిపోతాయీ..
    ఎదలోన వ్రాసిన లేఖలు
    ఎదలోన వ్రాసిన లేఖలు
    బ్రతుకంతా ఉండిపోతాయీ..

    ఆ...లేఖలలో ఉదయించినవి
    నా భాగ్యరేఖలే..ఏ...
    మన ఊపిరిలో పులకించినవి
    మన ఊపిరిలో పులకించినవి
    వలపు వాకలే.....

    సిపాయీ సిపాయీ..
    సిపాయీ సిపాయీ..
    నీకై ఎంత ఎంత వేగి వేగి పోయానో
    ఈ పూల మనసునడుగు అడుగు చెపుతాయీ
    హసీనా..ఓ..హసీనా
    సిపాయీ..ఓ..సిపాయీ
    హసీనా..ఓ..హసీనా

    ReplyDelete
  160. మీరు పప్పులో కాలేసారు!!
    ఓ ఘంటసాల పాట - అంత్యాక్షరంతో ఓ యస్.పి.బి పాట.

    "లడ్దు లడ్డు లడ్డు ..బందరు మిఠాయి లడ్డు..
    బూందీ లడ్డు..కోవా లడ్డు..రవ్వా లడ్డూ.."
    పై ఘంటసాల గారి పాటకి కంటిన్యూయేషన్ బాలూ గారి పాట రావాలి...

    ReplyDelete
  161. O..avunaa....:((

    sare Try chestaa :(

    ReplyDelete
  162. paaTa chivari aksharamtO paaDaalaa ?

    " Da" tO paaDaalaa ?

    ReplyDelete
  163. చివరి అక్షరంతో!! అవును. ఒకవేళా దొరక్కపోతే చివరికన్నా ముందుది.అంటే చివరి నుండి రెండో అక్షరం అన్నమాట.

    ReplyDelete
  164. ఫిల్మ్!! సత్యభామ!!1981
    సంగీతం::చక్రవర్తి
    రచన::వేటూరి
    పాడినది::S.P.బాలు,S.జానకి

    డాడి డాడీ..ఓ..మై డాడీ
    నువ్వు వస్తేనే సంతోషమూ...
    ముద్దులిస్తేనే ఆనందమూ..

    నీ పేరు వింటేనే.. నీమాట అంటేనే..
    కొడుతుంది మా అమ్మ గొడవేమిటీ
    నీ జట్టు కడితేనే..నీ నీడ పడితేనే
    కారాలు నూరేను కథ ఏమిటీ
    డాడీలు తప్పులివీ..మమ్మీలు మెచ్చనివీ
    చేసాను ఒకనాడు..చెప్పలేను ఈనాడూ..
    ఏమిటా తప్పూ..సస్పెన్స్..నాకైన చెప్పు..నో నో..
    తప్పించుకోలేవు అదినాకు చెప్పు

    ReplyDelete
  165. ika vunTaananDii bhaaskar gaaru...

    SubhOdayam meeku...

    Subha raatrii maaku..

    BYE...

    ReplyDelete
  166. good article
    https://goo.gl/Ag4XhH
    plz watch our channel

    ReplyDelete
  167. nice blog
    https://youtu.be/2uZRoa1eziA
    plz watch our channel

    ReplyDelete
  168. ఉత్సాహకరమైన అంత్యాక్షరి

    ReplyDelete
  169. good అంత్యాక్షరి.. జనాలు ఇంకా ఆన్లైన్లో ఉన్నారా

    ReplyDelete
  170. సూపర్ అంత్యాక్షరీ.

    ReplyDelete