Tuesday, September 9, 2008

మేఘమా దేహమా మెరవకే ఈక్షణం

మేఘమా దేహమా మెరవకే ఈక్షణం
మెరిసినా కురిసినా కరుగునీ జీవనం
మేఘమా దేహమా మెరవకే ఈక్షణం
మెరిసినా కురిసినా కరుగునీ జీవనం
మేఘమా దేహమా మెరవకే ఈక్షణం
మెరుపులతో పాటు ఉరుములుగా ...
మూగబోయే జీవస్వరములుగా
వేకువ ఝామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా
స్మృతిలో మిగిలే నవ్వులుగా
వేసవిలో మంచు పల్లకిగా
మేఘమా దేహమా మెరవకే ఈక్షణం
మెరిసినా కురిసినా కరుగునీ జీవనం
మేఘమా దేహమా మెరవకే ఈక్షణం
పెనుగాలికి పెళ్ళి చూపు
పువ్వు రాలిన వేళా కల్యాణం
అందాకా ఆరాటం ఆశలతో పేరంటం
నాకొక పూమాల తేవాలి నువ్వు
నాకొక పూమాల తేవాలి నువ్వు
అది ఎందుకో ...మేఘమా దేహమా మెరవకే ఈక్షణం
మెరిసినా కురిసినా కరుగునీ జీవనం
మేఘమా దేహమా మెరవకే ఈక్షణం

2 comments:

  1. భాస్కర్ రామరాజు గారు చాలా ఆశ్చర్యం గా ఉందండీ మీ ప్రొఫైల్ చూసి అచ్చెరువొందాను. మన అభిరుచులు, రాశులు, ఊర్లు అన్ని ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. ఈ బ్లాగ్ లో ఉన్న పాటలన్నీ నేను ఏరి కూర్చినవా అనిపించేలా ఉన్నాయ్. It's nice knowing you.

    ReplyDelete
  2. baagundi bossssssssss..........
    chivaralo line nakoka poomaala tevali neevu annappudu .....chaala baaguntundi song

    ReplyDelete