Thursday, September 25, 2008

ఆకాశం నీ హద్దురా

చిత్రం: సొమ్మొకడిదీ సోకొకడిది.
రాసినవారు:
సంగీతం:
పాడినవారు: యస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా
పరువాల తొలిపొద్దులో హమేషా తమాషా చెయ్యరా
ఆకాశం నీ హద్దురా అవకాశం వదలొద్దురా
పరువాల తొలిపొద్దులో హమేషా తమాషా చెయ్యరా
హమేషా తమాషా చెయ్యరా ॥ ఆకాశం ॥

నేలవిడిచి సాములెన్నో చెయ్యరా
మబ్బుల్లో మెఱుపంతా నీదిరా
నిలబడు తాగేనీరు చేదురా
పరుగెత్తనా పాలు తాగరా
బ్రతుకంటే బస్తీమే సవ్వాల్రా ప్రపంచమే మాయాబజారురా
ప్రపంచమే మాయాబజారురా
గురిచూసి కొట్టాలిరా సిరిచీసి పట్టాలిరా
నీ ఎత్తు ఎదగాలంటే ఎత్తులో జిత్తులు వెయ్యరా
ఎత్తులో జిత్తులు వెయ్యరా ॥ ఆకాశం ॥

నుదుటిరాత నువ్వు మార్చి రాయరా
నూరేళ్ళ అనుభవాలు నీవిరా
అనుకొన్నది పొందటమే నీతిరా
మనకున్నది పెంచటమే ఖ్యాతిరా
మనిషి జెన్మ మఱువలేని ఛాన్సురా
ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా
ఈ రేసులో జాక్పాట్ కొట్టాలిరా
సుడిలోకిదూకాలిరా
కడదాకా ఈదాలిరా
నీ ఒడ్డు చేరాలంటే థడాకా మజాకా చూపరా
థడాకా మజాకా చూపరా ॥ ఆకాశం ॥

2 comments:

  1. ఙీవితంలో పాఠం నేర్పిన పాట.........! నాకు చాలా ఇష్టమైన పాట........!

    ReplyDelete
  2. మంచిగా చెప్పావ్ బ్రదరూ...ఎలా ఉంది వాషింగ్టన్??

    ReplyDelete