Tuesday, March 13, 2007

మల్లేశ్వరి (1951) - మనసున మల్లెలల

చిత్రం : మల్లేశ్వరి - 1951
సంగీతం : సాలూరి రాజేస్వర రావు
రచన : దేవులపల్లి
పాడినవారు : భానుమతి, ఘంటసాల

మనసున మల్లెలల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంత హాయి ఈరేయి నిండెనో
ఎంత హాయి ఈరేయి నిండెనో ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో
కొమ్మల గువ్వలు గుసగుస మనినా రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలను కొలనులో గలగల మనినా అలను కొలనులో గలగల మనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీపిలుపే వినీ నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయచూచితిని
గడియయేమి ఇక విడిచిపోకుమా గడియయేమి ఇక విడిచిపోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో ఎంత హాయి ఈ రేయి నిడెనో


మల్లేశ్వరి (1951) - నెలరాజా వెన్నెలరాజా

చిత్రం : మల్లేశ్వరి - 1951
సంగీతం : సాలూరి రాజేస్వర రావు
రచన : దేవులపల్లి
పాడినవారు : భానుమతి, ఘంటసాల

ఎవరు ఏమని విందురూ
ఎవరు ఏమని విందురూ
ఎవ్వరేమని కందురూ
ఈ జాలి గాధ ఈ విషాద గాధ
నెలరాజా వెన్నెలరాజా
నెలరాజా వెన్నెలరాజా
వినవా ఈగాధా
నెలరాజా వెన్నెలరాజా
యేనాడో ఏకమై కలసిపోయిన జంట ఏకౄరదైవమో ఎడబాటు చేసెనే
ఊరు గుడిలో రావికావల నాటి వలపుల మాటాలన్ని
నేలపాలైపోయనే గాలిమేడలు కూలినే
నెలరాజా వెన్నెలరాజా వినవా ఈగాధా
నెలరాజా వెన్నెలరాజా
ఆ రావి ఆ బావి ఆ స్వామి సాక్షిగా
ఆనాటి బాధలూ అన్ని కలలాయనే
విడిచివచ్చే వేళతెలవని అడుగనైనా అడుగలేదని
ఎంతగా చింతించెనో ఏమనుచూ దుఖించెనో
పొగిలి గుండెలు పగిలెనే తుదకు బాధలు మిగిలనే
నెలరాజా వెన్నెలెరాజా వినవా ఈగాధా
నెలరాజా వెన్నెలరాజా

మల్లేశ్వరి (1951) - ఆకాశ వీధిలో

చిత్రం : మల్లేశ్వరి - 1951
సంగీతం : సాలూరి రాజేస్వర రావు
రచన : దేవులపల్లి
పాడినవారు : భానుమతి, ఘంటసాల

ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు దేశదేశాలన్ని తిరిగిచూసేవూ
ఏడతానున్నాడో బావా ఏడతానున్నాడో బావా
జాడ తెలిసిన పోయిరావా
అందాల ఓ మేఘమాలా అందాల ఓ మేఘమాలా

గగనసీమల తేలు ఓ మేఘమాలా
మా వూరు గుడి పైన మసలి వస్తున్నావా
మల్లి మాటేదైనా నాతో మనసు చల్లగా చెప్పి పోవా
నీలాల ఓ మేఘమాలా రాగాల ఓ మేఘమాలా

మమతలెరిగిన మేఘమాలా
మమతలెరిగిన మేఘమాలా
నా మనసు బావకు చెప్పిరావా
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతోరేపవలు
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతోరేపవలు
ఎదురుతెన్నులు చూచెనే ఎదరి కాయలు కాచెనే
అందాల ఓ మేఘమాలా రాగాల ఓ మెఘ మాలా

మనసు తెలిసిన మీఘమాలా మరువలేనని చెప్పలేవా
మల్లితో మరువులేవని చెప్పలేవా
కళ్ళు తెరచిన గానీ కళ్ళుమూసినగానీ
కళ్ళు తెరచిన గానీ కళ్ళుమూసినగానీ
మల్లిరూపే నిలిచనే నా చెంత మల్లి మాటే పిలిచెనే

జాలిగుండెల మేఘమాలా బావ లేనిదే బ్రతుకజాలా
జాలిగుండెల మేఘమాలా
కురియునాకన్నీరు గుండెలో దాచుకుని వానజల్లుగ కురిసిపోవా
కన్నీరు వాన వాలుగా బావ దోలా

మల్లేశ్వరి (1951) - ఓనా నిజమేనా

చిత్రం : మల్లేశ్వరి - 1951
సంగీతం : సాలూరి రాజేస్వర రావు
రచన : దేవులపల్లి
పాడినవారు : భానుమతి, ఘంటసాల

ఓనా నిజమేనా
ఓనా నిజమేనా
మరతునన్న మరవలేని మమతలన్ని కలలేనా
రాణివాసమేగేవా బావమాట మరచేవా
ఓనా నిజమేనా ఓనా నిజమేనా
ఓనా
మనసులోనా మరులుగొలిపి కడకు మాయమాయేనా
ప్రాణమున్న మల్లి పోయి రాతి బొమ్మ మిగిలేనా
ఓనా నిజమేనా
ఓనా
ఓనా కలలేనా
ఓనా కలలేనా
నాటి కధలు వ్యధలేనా నీటి పైని అలలేనా
నాటి కధలు వ్యధలేనా నీటి పైని అలలేనా
బావ నాకు కరువేనా బ్రతుకు ఇంక బరువేనా
బావ నాకు కరువేనా బ్రతుకు ఇంక బరువేనా
ఓనా కలలేనా
పగలు లేని రేయి వోలే పలుకలేని రాయి వోలే
బరువుబతుకు మిగిలేనా వలపులన్ని కలలేనా
ఓనా కలలేనా
ఓనా కలలేనా