Wednesday, October 31, 2007

ఆడదిఅంటే లయంలయం ఆ నీడంటేనే భయం భయం

కొంపకునిప్పంటుకుంటే పైకప్పేకాలిపోతుంది
హరిదాసులను ఆడది అంటుకుంటే బ్రతుకే కూలిపోతుంది
ఆడదిఅంటే లయంలయం ఆ నీడంటేనే భయం భయం
ఆడదిఅంటే లయంలయం ఆ నీడంటేనే భయం భయం
ముక్కుమూసుకుని యోగంపట్టే మునిరాయెళ్ళకి ప్రణయం
ముక్కుమూసుకుని యోగంపట్టే మునిరాయెళ్ళకి ప్రణయం
హరుడంతటి బల్మగవాడ్నే హరుడంతటి బల్మగవాడ్నే ఆటాడించిందాడది ఓ ఆటాడించిందాడది
ఆడదిఅంటే లయంలయం ఆ నీడంటేనే భయం భయం
కల్లా కపటం రెండూకళ్ళు కళ్ళు భ్రమించే వళ్ళు
కల్లా కపటం రెండూకళ్ళు కళ్ళు భ్రమించే వళ్ళు
కాదయ్యో ఓ
కాదయ్యో పులిహోర పొంగలి గరళపుముద్దే ఆడాది
కాదయ్యో పులిహోర పొంగలి గరళపుముద్దే ఆడాది
ఆడదిఅంటే లయంలయం ఆ నీడంటేనే భయం భయం

నిదురపో నిదురపో నిదురపో...

నిదురపో .. నిదురపో .. నిదురపో ..
నిదురపో .. నిదురపో .. నిదురపో ..
నిద్దురపోరా తమ్ముడా నిద్దురపోరా తమ్ముడా
నిదురలోనా గతమునంతా నిముషమైనా మరచిపోరా
నిదురలోనా గతమునంతా నిముషమైనా మరచిపోరా
కరుణలేని ఈజగానా కలతనిదురే మేలురా నిద్దురపోరా తమ్ముడా
కలలుపండే కాలమంతా కనులముందే కదలిపోయే
కలలుపండే కాలమంతా కనులముందే కదలిపోయే
లేతమనసుల చిగురుటాశ పూతలోనే రాలిపోయే
లేతమనసుల చిగురుటాశ పూతలోనే రాలిపోయే నిద్దురపోరా తమ్ముడా
జాలితలిచి కన్నీరు తుడిచే దాతలే కనరారే
జాలితలిచి కన్నీరు తుడిచే దాతలే కనరారే
చితికిపోయిన జీవితమంతా ఇంతలో చితిఆయే
నీడజూపి నిలవుమనకూ నిదురయేరా తమ్ముడా నిద్దురపోరా తమ్ముడా

సడిసేయకో గాలి సడిసేయబోకే

సడిసేయకోగాలి సడిసేయబోకే..
సడిసేయకోగాలి సడిసేయబోకే
బడలి ఒడిలోరాజు పవళించేనే సడిసేయకే
రత్నపీఠికలేని రారాజు నాస్వామి
మణికిరీటములేని మహరాజుగాకేమి
చిలిపిపరుగులుమాని కొలిచిపోరాదే సడిసేయకే
ఏటిగలగలకే ఎగసి లేచేనే
ఆకుకదలికలకే అదరిచూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే సడిసేయకే
పండువెన్నెల నడిగి పాంపుతేరాదే
నీడమబ్బులదాగు నిదురతేరాదే
విరుల వీవెనవూని విసిరిపోరాదే
సడిసేయకోగాలి సడిసేయబోకే
బడలి ఒడిలోరాజు పవళించేనే సడిసేయకే కోగాలి...

ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా

కల్లాకపటం కానలి వాడా లోకంపోకడ తెలియని వాడా
కల్లాకపటం కానలి వాడా లోకంపోకడ తెలియని వాడా
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నానీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా
నవధాన్యాలను గంపకెత్తుకుని చద్ది అన్నమూ మూటాగట్టుకుని
ముల్లుగర్రనూ చేతబట్టుకుని ఇల్లాలుని నీ వెంటబెట్టుకుని
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నానీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా
పడమట దిక్కున వరదగుడేసే ఉరుముల మెఱుపుల వానలుగురిసే
వాగులువంకలు ఉఱవడిజేసే ఎండినబీళ్ళు ఇగుళ్ళువేసే
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నానీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా
కోటెరును సరిజూసి పన్నుకో ఎలపలదాపల ఎడ్లుదోలుకో
సాలుతప్పక పొందవేసుకో ఇత్తనమ్ము ఇసి రిసిరి జల్లుకో
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నానీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా
పొలాలమ్ముకుని పోయేవారు టౌనును మేడలు కట్టేవారు
బ్యాంకుల డబ్బును దాచేవారు ఈ శక్తిని గమనిచరువారు
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నానీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా
పల్లెటూళ్ళలో చల్లనివారు పాలిటిక్సులోబ్రతికేవాళ్ళు
ప్రజాశక్తియని అరచేవారు.. ప్రజాశక్తియని అరచేవారు వళ్ళువంచి చాకిరికిమల్లరు
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నానీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా
పదవులు స్థిరమని భ్రమిసే వాళ్ళే వోట్లుగుంజి నిను మరచేవాళ్ళే
నీవేదిక్కని వక్కరు పదవోయ్.. నీవేదిక్కని వక్కరు పదవోయ్ రోజులుమారాయ్ రోజులుమారాయ్ మారాయ్ మారాయ్ మారాయ్ రోజులు మారాయ్
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నానీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా

Tuesday, March 13, 2007

మల్లేశ్వరి (1951) - మనసున మల్లెలల

చిత్రం : మల్లేశ్వరి - 1951
సంగీతం : సాలూరి రాజేస్వర రావు
రచన : దేవులపల్లి
పాడినవారు : భానుమతి, ఘంటసాల

మనసున మల్లెలల మాలలూగెనే కన్నుల వెన్నెల డోలలూగెనే
ఎంత హాయి ఈరేయి నిండెనో
ఎంత హాయి ఈరేయి నిండెనో ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో
కొమ్మల గువ్వలు గుసగుస మనినా రెమ్మల గాలులు ఉసురుసురనినా
అలను కొలనులో గలగల మనినా అలను కొలనులో గలగల మనినా
దవ్వుల వేణువు సవ్వడి వినినా దవ్వుల వేణువు సవ్వడి వినినా
నీవు వచ్చేవని నీపిలుపే వినీ నీవు వచ్చేవని నీ పిలుపే విని
కన్నుల నీరిడి కలయచూచితిని
గడియయేమి ఇక విడిచిపోకుమా గడియయేమి ఇక విడిచిపోకుమా
ఎగసిన హృదయము పగులనీకుమా
ఎన్నినాళ్ళకీ బ్రతుకు పండెనో ఎంత హాయి ఈ రేయి నిడెనో


మల్లేశ్వరి (1951) - నెలరాజా వెన్నెలరాజా

చిత్రం : మల్లేశ్వరి - 1951
సంగీతం : సాలూరి రాజేస్వర రావు
రచన : దేవులపల్లి
పాడినవారు : భానుమతి, ఘంటసాల

ఎవరు ఏమని విందురూ
ఎవరు ఏమని విందురూ
ఎవ్వరేమని కందురూ
ఈ జాలి గాధ ఈ విషాద గాధ
నెలరాజా వెన్నెలరాజా
నెలరాజా వెన్నెలరాజా
వినవా ఈగాధా
నెలరాజా వెన్నెలరాజా
యేనాడో ఏకమై కలసిపోయిన జంట ఏకౄరదైవమో ఎడబాటు చేసెనే
ఊరు గుడిలో రావికావల నాటి వలపుల మాటాలన్ని
నేలపాలైపోయనే గాలిమేడలు కూలినే
నెలరాజా వెన్నెలరాజా వినవా ఈగాధా
నెలరాజా వెన్నెలరాజా
ఆ రావి ఆ బావి ఆ స్వామి సాక్షిగా
ఆనాటి బాధలూ అన్ని కలలాయనే
విడిచివచ్చే వేళతెలవని అడుగనైనా అడుగలేదని
ఎంతగా చింతించెనో ఏమనుచూ దుఖించెనో
పొగిలి గుండెలు పగిలెనే తుదకు బాధలు మిగిలనే
నెలరాజా వెన్నెలెరాజా వినవా ఈగాధా
నెలరాజా వెన్నెలరాజా

మల్లేశ్వరి (1951) - ఆకాశ వీధిలో

చిత్రం : మల్లేశ్వరి - 1951
సంగీతం : సాలూరి రాజేస్వర రావు
రచన : దేవులపల్లి
పాడినవారు : భానుమతి, ఘంటసాల

ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు దేశదేశాలన్ని తిరిగిచూసేవూ
ఏడతానున్నాడో బావా ఏడతానున్నాడో బావా
జాడ తెలిసిన పోయిరావా
అందాల ఓ మేఘమాలా అందాల ఓ మేఘమాలా

గగనసీమల తేలు ఓ మేఘమాలా
మా వూరు గుడి పైన మసలి వస్తున్నావా
మల్లి మాటేదైనా నాతో మనసు చల్లగా చెప్పి పోవా
నీలాల ఓ మేఘమాలా రాగాల ఓ మేఘమాలా

మమతలెరిగిన మేఘమాలా
మమతలెరిగిన మేఘమాలా
నా మనసు బావకు చెప్పిరావా
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతోరేపవలు
ఎన్నాళ్ళు నా కళ్ళు దిగులుతోరేపవలు
ఎదురుతెన్నులు చూచెనే ఎదరి కాయలు కాచెనే
అందాల ఓ మేఘమాలా రాగాల ఓ మెఘ మాలా

మనసు తెలిసిన మీఘమాలా మరువలేనని చెప్పలేవా
మల్లితో మరువులేవని చెప్పలేవా
కళ్ళు తెరచిన గానీ కళ్ళుమూసినగానీ
కళ్ళు తెరచిన గానీ కళ్ళుమూసినగానీ
మల్లిరూపే నిలిచనే నా చెంత మల్లి మాటే పిలిచెనే

జాలిగుండెల మేఘమాలా బావ లేనిదే బ్రతుకజాలా
జాలిగుండెల మేఘమాలా
కురియునాకన్నీరు గుండెలో దాచుకుని వానజల్లుగ కురిసిపోవా
కన్నీరు వాన వాలుగా బావ దోలా

మల్లేశ్వరి (1951) - ఓనా నిజమేనా

చిత్రం : మల్లేశ్వరి - 1951
సంగీతం : సాలూరి రాజేస్వర రావు
రచన : దేవులపల్లి
పాడినవారు : భానుమతి, ఘంటసాల

ఓనా నిజమేనా
ఓనా నిజమేనా
మరతునన్న మరవలేని మమతలన్ని కలలేనా
రాణివాసమేగేవా బావమాట మరచేవా
ఓనా నిజమేనా ఓనా నిజమేనా
ఓనా
మనసులోనా మరులుగొలిపి కడకు మాయమాయేనా
ప్రాణమున్న మల్లి పోయి రాతి బొమ్మ మిగిలేనా
ఓనా నిజమేనా
ఓనా
ఓనా కలలేనా
ఓనా కలలేనా
నాటి కధలు వ్యధలేనా నీటి పైని అలలేనా
నాటి కధలు వ్యధలేనా నీటి పైని అలలేనా
బావ నాకు కరువేనా బ్రతుకు ఇంక బరువేనా
బావ నాకు కరువేనా బ్రతుకు ఇంక బరువేనా
ఓనా కలలేనా
పగలు లేని రేయి వోలే పలుకలేని రాయి వోలే
బరువుబతుకు మిగిలేనా వలపులన్ని కలలేనా
ఓనా కలలేనా
ఓనా కలలేనా

Thursday, January 4, 2007

కీలుగుఱ్ఱం (1949)

ఎవరుజేసిన కర్మ
రాసినవారు : తాపీ ధర్మా రావు (??)
పాడినవారు : ఘంటసాల
సంగీతం : ఘంటసాల (??)

ఎవరుజేసిన కర్మ వారనుభవించకా ఏదికైనను తప్పదన్నా
ఏనాడో ఏతీరో ఎవరు చెప్పాగలరు అనిభవించుట తిధమన్నా
ఏనాడో ఏతీరో ఎవరు చెప్పాగలరు అనిభవించుట తిధమన్నా
రాముడంతటివాడు రమణి సీతను బాసీ
రాముడంతటివాడు రమణి సీతను బాసీ పామరునివలె ఏడ్చెనన్నా
రాముడంతటివాడు రమణి సీతను బాసీ పామరునివలె ఏడ్చెనన్నా పామరునివలే ఏడ్చెనన్నా
ఎవరుజేసిన కర్మ వారనుభవించకా ఏదికైనను తప్పదన్నా
ఏనాడో ఏతీరో ఎవరు చెప్పాగలరు అనిభవించుట తిధమన్నా
ఆనాటి పాండవులు ఆకులలములుమేసి అడవిపాలైపోయిరన్నా
ఆనాటి పాండవులు ఆకులలములుమేసి అడవిపాలైపోయిరన్నా
కడుపుపగిలేటట్టు కుడుములూ నేతింటే
కడుపుపగిలేటట్టు కుడుములూ నేతింటే
కడుపొరులకెట్లొబ్బురన్నా
కడుపొరులకెట్లొబ్బురన్నా
ఎవరుజేసిన కర్మ వారనుభవించకా ఏదికైనను తప్పదన్నా
ఏనాడో ఏతీరో ఎవరు చెప్పాగలరు అనిభవించుట తిధమన్నా
కడివెడుతీర్ధమూ నేదాగ కళ్ళెర్ర మీకెందుకన్నా
కడివెడుతీర్ధమూ నేదాగ కళ్ళెర్ర మీకెందుకన్నా
నా ఒళ్ళుబరువుకూ నే ఏడ్వవలెకాని ఒరులెందుకేడ్తురో రన్నా
నా ఒళ్ళుబరువుకూ నే ఏడ్వవలెకాని ఒరులెందుకేడ్తురో రన్నా
ఎవరుజేసిన కర్మ వారనుభవించకా ఏదికైనను తప్పదన్నా
ఏనాడో ఏతీరో ఎవరు చెప్పాగలరు అనిభవించుట తిధమన్నా
ఏనాడో ఏతీరో ఎవరు చెప్పాగలరు అనిభవించుట తిధమన్నా

గుణసుందరికధ (1949)

అదియే యెదురై వచ్చేదాకా
పాడినివారు : రేలంగి, పామర్తి కృష్ణమూర్తి.
రాసినవారు : పింగళి నాగేంద్ర రావు.
సంగీతం : ఓగిరాల

లాల లాల లాల లా
లాల లాల లాల లా
లాల లేల ళుల లై
లల్లాల్లాలాలల్లల్లా
అదియే యెదురై వచ్చేదాకా పదరా ముందుకి పడిపోదాం
అదియే యెదురై వచ్చేదాకా పదరా ముందుకి పడిపోదాం
అహా పదరా ముందుకి పడిపోదాం
హాయి సఖా!! హాయి సఖా అని ఊర్వశి ఏంచేస్తావుర అన్నయ్యా?, నీవేంచేస్తావుర అన్నయ్యా?
ఛీఛీ పోవే జేజెమ్మా యని తరిమేస్తారా తమ్మయ్య, నే తరిమేస్తారా తమ్మయ్య
రాసక్రీడకు రంభేవస్తే యెంజేస్తావుర అన్నయ్య? రాసక్రీడకు రంభేవస్తే యేంజేస్తావుర అన్నయా?, నీవేంజేస్తావుర అన్నయ్యా?
మీసం తిప్పి రోషం జూపి వదిలేస్తారా తమ్మయ్య, నేనొదిలేస్తారా తమ్మయ్యా
మరి యేడుకొండలు యెదురునిలిస్తే యేంజేస్తావుర అన్నయ్య?, నీవేంజేస్తావుర అన్నయ్యా?
జై వెంకటేసునికి దండం పెట్టి యెగిరేస్తారా తమ్మయ్యా, నే నెగిరేస్తరా తమ్మయ్య
నాన నాన నాన నా
నాన నాన నాన నా
అంతా అడవే అన్ని మ్రుగాలే!! ఐతే?
అంతా అడవే అన్ని మ్రుగాలే ఎలుగెదురొస్తే యేంజేస్తావ్?, నువ్వు ఎలుగెదురొస్తే యేంజేస్తావ్?
పులినెదురేస్తా తమ్మయ్య, నీ పులినెదురేస్తా తమ్మయ్యా
పులియెదురొస్తే?
ఏనుగ ఉంది!!
ఏనుగ వస్తీ?
సిమ్హాన్నడెద!! అబ్బా!! అబ్బా!!
సిమ్హము వస్తే ఏంజేస్తావ్? అహ సిమ్హము వస్తే యేంజేస్తావ్?
నాన నాన నాన నా
బాబ బాబ బెబ్బెబ్బా

ధర్మ దేవత (1950)

విరిసే వెన్నెలలో
పాడినవారు : రేలంగి, జిక్కి మరియు కోరస్
రాసినవారు :
సంగీతం:

విరిసే వెన్నెలలో వెంట జంట ఉండలోయ్
విరిసే వెన్నెలలో వెంట జంట ఉండలోయ్
జతగూడి పలుకాడే పడుచే ఉండాలోయ్
జతగూడి పలుకాడే పడుచే ఉండాలోయ్
మరదలు యెదురైతే నిలు నిలూ అనాలి
మరదలు యెదురైతే నిలు నిలూ అనాలి
అది సరె సరె అనాలి
బెడిసి కోప్పడితే దండుగలే పడితే పండుగలే ఓఓఓ
విరిసే వెన్నెలలో వెంట జంట ఉండలోయ్
జతగూడి పలుకాడే పడుచే ఉండాలొయ్
కిలా కిలా నవ్వులకు తేనెపూతవ్వులకు బెదరిపోవు డెంకములేలే
ఈ మగధీరుల తీరులివేలే ఇవేలే
పదుచు బంతిపువ్వు పకాలు అనేలే
జడిసీ నీమనసూ కుబేలు అనేలే
ఒడిసిపట్టుకొని ఒట్టుబెట్టుకునేలే
ఒడిసిపట్టుకొని ఒట్టుబెట్టుకునేలే
పడుచు కన్నుకొట్టి చనేలే ఓఓఓ
విరిసే వెన్నెలలో వెంట జంట ఉండలోయ్
జతగూడి పలుకాడే పడుచే ఉండాలొయ్
చిలిపిపాటలకు చికిలి మాటలకు కులికే చిన్నారి సరీ వయ్యారీ
చిలిపిపాటలకు చికిలి మాటలకు కులికే చిన్నారి సరీ వయ్యారీ
మురిసేపువ్వులా సరాలు వలపే వరాలూ
ఓఓఓ కన్నులా చల్లనైయ్యె అందములా మనిసే చందములా ఓఓఓఓ
విరిసే వెన్నెలలో వెంట జంట ఉండలోయ్
జతగూడి పలుకాడే పడుచే ఉండాలొయ్
ఒరులు కొమ్ము కలా చిటాపటా పొటేలు బల్ బలే బలే పొటేలు
కొసరుజూపి పందెములాడుతావా ఎగిరి దూకుతావా
విరిసే విరిసే విరిసే వెన్నెలలో వెంట జంట ఉండలోయి వెంటా జంటా ఉండాలోయ్ ఉండలోయ్