Wednesday, December 27, 2006

రాజు - పేద (1954)

జేబులో బొమ్మ
పాడినవారు : ఘంటసాల
రాసినవారు :
సంగీతం :
జేజేలను వినీ గొప్పవారమనీ చెడ్డపనుల మాచేత చేయింపకుమా
జేబులో బొమ్మ జేబులో బొమ్మ జేజేలా బొమ్మా జేబులోబొమ్మ జేజేలా బొమ్మ జేబులో బొమ్మ
మొక్కినమొక్కులు చల్లంగుండి మొక్కిన మొక్కులు చల్లంగుండి
యెనక్కి తిరక్క గెలుస్తు ఉంటే
భక్తి తోడ నీ విగ్రహానికి బంగరుతొడుపేయించదనమ్మా
జేబులో బొమ్మ జేజేలా బొమ్మా జేబులో బొమ్మా
కనక తప్పెటలు ఘణ ఘణ మ్రోయగ శంఖనాదములు శివమెత్తించగ
కనక తప్పెటలు ఘణ ఘణ మ్రోయగ శంఖనాదములు శివమెత్తించగ
చేసినతప్పులు చిత్తైపోవగ చేతులెత్తి ప్రార్ధించెదనమ్మా
జేబులో బొమ్మ జేబులో బొమ్మ జేజేలా బొమ్మా జేబులోబొమ్మ
మారాజులకు మనసులుమారి మంత్రిపదవి నా తలపైకొస్తే
మారాజులకు మనసులుమారి మంత్రిపదవి నా తలపైకొస్తే
వేడుకతీరగ పూసకూర్పుతో జోడుప్రభల కట్టించెదనమ్మా
జేబులో బొమ్మ జేబులో బొమ్మ జేజేలా బొమ్మా జేబులోబొమ్మ
మాఇలవేల్పుగ మహిమలు జూపి మల్లికినాకు మనసుగల్పితే బొమ్మా
మాఇలవేల్పుగ మహిమలు జూపి మల్లికినాకు మనసుగల్పితే
తకిట తధిగిన తకతై అంటూ చెక్కభజన చేయించెదనమ్మా
జేబులో బొమ్మ జేబులో బొమ్మ జేజేలా బొమ్మా జేబులోబొమ్మ
జేబులో బొమ్మ జేబులో జేబులో జేబులో బొమ్మా

భూకైలాస్ (1958)

దేవ దేవ ధవళాచల
పాడినవారు : ఘంటసాల
రాసినవారు : సముద్రాల జూ
సంగీతం :
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమోనమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమోనమో
పాలితకింకర భవనా శంకర శంకరపురహర నమోనమో
పాలితకింకర భవనా శంకర శంకరపురహర నమోనమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమో నమో
దురిత విమోచన ఫాలొవిలోచన పరమదయాకర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమో నమో
నమో నమో నమో నమో నమో నమో
నారయణ హరి నమో నమో నారయణ హరి నమో నమో
నారయణ హరి నమో నమో నారయణ హరి నమో నమో
నారద హ్రుదయ విహారి నమో నమో నారద హ్రుదయ విహారి నమో నమో
నారయణ హరి నమో నమో నారయణ హరి నమో నమో
నారయణ హరి నమో నమో నారయణ హరి నమో నమో
పంకజనయనా పన్నగ శయనా
పంకజనయనా పన్నగ శయనా
శంకర వినుతా నమో నమో
శంకర వినుతా నమో నమో
నారయణ హరి నమో నమో నారయణ హరి నారయణ హరి నారయణ హరి నమో నమో

కులదైవం (1960)

పయనించే ఓ చిలుకా
పాడినవారు : ఘంటసాల
రాసినవారు :
సంగీతం :
పయనించే ఓ చిలుకా
పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయను గూడూ
పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయను గూడూ
పయనించే ఓ చిలుకాతీరెను రోజులు నీకీ కొమ్మకు పొమ్మా ఈచోటు వదలీ
తీరెను రోజులు నీకీ కొమ్మకు పొమ్మా ఈచోటు వదలీ
ఎవరికి వారే ఏదోనాటికి ఎరుగము యెచకో ఈ బరివీ
మూడు దినాలా ముచ్చటయే
మూడు దినాలా ముచ్చటయే ఈ లోకములో మన మజిలీ
నిజాయితీగా ధర్మపధానానిజాయితీగా ధర్మపధానా చనుమా ధైర్యమె తోడూ
పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయను గూడూ

పయనించే ఓ చిలుకా
పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయను గూడూ
పయనించే ఓ చిలుకా
పుల్లా పుడకా ముక్కున కరచి గూడును కట్టితివోయీ
పుల్లా పుడకా ముక్కున కరచి గూడును కట్టితివోయీ
వానకు తడిసిన నీ బిగిరెక్కలు యెండకు ఆరినవోయీ
ఫలించలేదని చేసిన కష్టమూ
ఫలించలేదని చేసిన కష్టమూ మదిలో వేదన వలదోయీ
రాదోయీ సిరి నీవెనువెంటా
రాదోయీ సిరి నీవెనువెంటా త్యాగమే నీచేదోడూ
పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయను గూడూ
పయనించే ఓ చిలుకా

పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయను గూడూ
పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయను గూడూ
పయనించే ఓ చిలుకా
మరవాలీ నీ కులుకులనడలే మదిలోనయగారాలే
మరవాలీ నీ కులుకులనడలే మదిలోనయగారాలే
తీరనివేదన తీయనిముసుగే సిరసున సింగారాలే
ఓర్వలేని ఈ జగతికి నీపై
ఓర్వలేని ఈ జగతికి నీపై లేదే కనికారాలే
కరిగీ కరిగీ కన్నీరై
కరిగీ కరిగీ కన్నీరై కడ తేరుట నీ తలవ్రాలే
పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయను గూడూ
పయనించే ఓ చిలుకా
భోడుమనీ విలపించేరే నీ గుణమూ తెలిసినవారూ
భోడుమనీ విలపించేరే నీ గుణమూ తెలిసినవారూ
జోడుగనీతో ఆడీ పాడీ కూరుములాడిన వారు
ఏరులయే కన్నీరులతో మనసార దీవించేరే
యెన్నడో తిరిగి ఇటు నీరాక యెవడే తెలిసిన వాడు
పయనించే ఓ చిలుకా ఎగిరిపో పాడైపోయను గూడూ
పయనించే ఓ చిలుకా