Wednesday, December 27, 2006

రాజు - పేద (1954)

జేబులో బొమ్మ
పాడినవారు : ఘంటసాల
రాసినవారు :
సంగీతం :
జేజేలను వినీ గొప్పవారమనీ చెడ్డపనుల మాచేత చేయింపకుమా
జేబులో బొమ్మ జేబులో బొమ్మ జేజేలా బొమ్మా జేబులోబొమ్మ జేజేలా బొమ్మ జేబులో బొమ్మ
మొక్కినమొక్కులు చల్లంగుండి మొక్కిన మొక్కులు చల్లంగుండి
యెనక్కి తిరక్క గెలుస్తు ఉంటే
భక్తి తోడ నీ విగ్రహానికి బంగరుతొడుపేయించదనమ్మా
జేబులో బొమ్మ జేజేలా బొమ్మా జేబులో బొమ్మా
కనక తప్పెటలు ఘణ ఘణ మ్రోయగ శంఖనాదములు శివమెత్తించగ
కనక తప్పెటలు ఘణ ఘణ మ్రోయగ శంఖనాదములు శివమెత్తించగ
చేసినతప్పులు చిత్తైపోవగ చేతులెత్తి ప్రార్ధించెదనమ్మా
జేబులో బొమ్మ జేబులో బొమ్మ జేజేలా బొమ్మా జేబులోబొమ్మ
మారాజులకు మనసులుమారి మంత్రిపదవి నా తలపైకొస్తే
మారాజులకు మనసులుమారి మంత్రిపదవి నా తలపైకొస్తే
వేడుకతీరగ పూసకూర్పుతో జోడుప్రభల కట్టించెదనమ్మా
జేబులో బొమ్మ జేబులో బొమ్మ జేజేలా బొమ్మా జేబులోబొమ్మ
మాఇలవేల్పుగ మహిమలు జూపి మల్లికినాకు మనసుగల్పితే బొమ్మా
మాఇలవేల్పుగ మహిమలు జూపి మల్లికినాకు మనసుగల్పితే
తకిట తధిగిన తకతై అంటూ చెక్కభజన చేయించెదనమ్మా
జేబులో బొమ్మ జేబులో బొమ్మ జేజేలా బొమ్మా జేబులోబొమ్మ
జేబులో బొమ్మ జేబులో జేబులో జేబులో బొమ్మా

No comments:

Post a Comment