Wednesday, October 31, 2007

ఆడదిఅంటే లయంలయం ఆ నీడంటేనే భయం భయం

కొంపకునిప్పంటుకుంటే పైకప్పేకాలిపోతుంది
హరిదాసులను ఆడది అంటుకుంటే బ్రతుకే కూలిపోతుంది
ఆడదిఅంటే లయంలయం ఆ నీడంటేనే భయం భయం
ఆడదిఅంటే లయంలయం ఆ నీడంటేనే భయం భయం
ముక్కుమూసుకుని యోగంపట్టే మునిరాయెళ్ళకి ప్రణయం
ముక్కుమూసుకుని యోగంపట్టే మునిరాయెళ్ళకి ప్రణయం
హరుడంతటి బల్మగవాడ్నే హరుడంతటి బల్మగవాడ్నే ఆటాడించిందాడది ఓ ఆటాడించిందాడది
ఆడదిఅంటే లయంలయం ఆ నీడంటేనే భయం భయం
కల్లా కపటం రెండూకళ్ళు కళ్ళు భ్రమించే వళ్ళు
కల్లా కపటం రెండూకళ్ళు కళ్ళు భ్రమించే వళ్ళు
కాదయ్యో ఓ
కాదయ్యో పులిహోర పొంగలి గరళపుముద్దే ఆడాది
కాదయ్యో పులిహోర పొంగలి గరళపుముద్దే ఆడాది
ఆడదిఅంటే లయంలయం ఆ నీడంటేనే భయం భయం

నిదురపో నిదురపో నిదురపో...

నిదురపో .. నిదురపో .. నిదురపో ..
నిదురపో .. నిదురపో .. నిదురపో ..
నిద్దురపోరా తమ్ముడా నిద్దురపోరా తమ్ముడా
నిదురలోనా గతమునంతా నిముషమైనా మరచిపోరా
నిదురలోనా గతమునంతా నిముషమైనా మరచిపోరా
కరుణలేని ఈజగానా కలతనిదురే మేలురా నిద్దురపోరా తమ్ముడా
కలలుపండే కాలమంతా కనులముందే కదలిపోయే
కలలుపండే కాలమంతా కనులముందే కదలిపోయే
లేతమనసుల చిగురుటాశ పూతలోనే రాలిపోయే
లేతమనసుల చిగురుటాశ పూతలోనే రాలిపోయే నిద్దురపోరా తమ్ముడా
జాలితలిచి కన్నీరు తుడిచే దాతలే కనరారే
జాలితలిచి కన్నీరు తుడిచే దాతలే కనరారే
చితికిపోయిన జీవితమంతా ఇంతలో చితిఆయే
నీడజూపి నిలవుమనకూ నిదురయేరా తమ్ముడా నిద్దురపోరా తమ్ముడా

సడిసేయకో గాలి సడిసేయబోకే

సడిసేయకోగాలి సడిసేయబోకే..
సడిసేయకోగాలి సడిసేయబోకే
బడలి ఒడిలోరాజు పవళించేనే సడిసేయకే
రత్నపీఠికలేని రారాజు నాస్వామి
మణికిరీటములేని మహరాజుగాకేమి
చిలిపిపరుగులుమాని కొలిచిపోరాదే సడిసేయకే
ఏటిగలగలకే ఎగసి లేచేనే
ఆకుకదలికలకే అదరిచూసేనే
నిదుర చెదరిందంటే నేనూరుకోనే సడిసేయకే
పండువెన్నెల నడిగి పాంపుతేరాదే
నీడమబ్బులదాగు నిదురతేరాదే
విరుల వీవెనవూని విసిరిపోరాదే
సడిసేయకోగాలి సడిసేయబోకే
బడలి ఒడిలోరాజు పవళించేనే సడిసేయకే కోగాలి...

ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా

కల్లాకపటం కానలి వాడా లోకంపోకడ తెలియని వాడా
కల్లాకపటం కానలి వాడా లోకంపోకడ తెలియని వాడా
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నానీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా
నవధాన్యాలను గంపకెత్తుకుని చద్ది అన్నమూ మూటాగట్టుకుని
ముల్లుగర్రనూ చేతబట్టుకుని ఇల్లాలుని నీ వెంటబెట్టుకుని
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నానీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా
పడమట దిక్కున వరదగుడేసే ఉరుముల మెఱుపుల వానలుగురిసే
వాగులువంకలు ఉఱవడిజేసే ఎండినబీళ్ళు ఇగుళ్ళువేసే
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నానీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా
కోటెరును సరిజూసి పన్నుకో ఎలపలదాపల ఎడ్లుదోలుకో
సాలుతప్పక పొందవేసుకో ఇత్తనమ్ము ఇసి రిసిరి జల్లుకో
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నానీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా
పొలాలమ్ముకుని పోయేవారు టౌనును మేడలు కట్టేవారు
బ్యాంకుల డబ్బును దాచేవారు ఈ శక్తిని గమనిచరువారు
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నానీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా
పల్లెటూళ్ళలో చల్లనివారు పాలిటిక్సులోబ్రతికేవాళ్ళు
ప్రజాశక్తియని అరచేవారు.. ప్రజాశక్తియని అరచేవారు వళ్ళువంచి చాకిరికిమల్లరు
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నానీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా
పదవులు స్థిరమని భ్రమిసే వాళ్ళే వోట్లుగుంజి నిను మరచేవాళ్ళే
నీవేదిక్కని వక్కరు పదవోయ్.. నీవేదిక్కని వక్కరు పదవోయ్ రోజులుమారాయ్ రోజులుమారాయ్ మారాయ్ మారాయ్ మారాయ్ రోజులు మారాయ్
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నానీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా