Wednesday, October 31, 2007

ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నా

కల్లాకపటం కానలి వాడా లోకంపోకడ తెలియని వాడా

ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నానీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా
నవధాన్యాలను గంపకెత్తుకుని చద్ది అన్నమూ మూటాగట్టుకుని
ముల్లుగర్రనూ చేతబట్టుకుని ఇల్లాలుని నీ వెంటబెట్టుకుని
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నానీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా
పడమట దిక్కున వరదగుడేసే ఉరుముల మెఱుపుల వానలుగురిసే
వాగులువంకలు ఉఱవడిజేసే ఎండినబీళ్ళు ఇగుళ్ళువేసే
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నానీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా
కోటెరును సరిజూసి పన్నుకో ఎలపలదాపల ఎడ్లుదోలుకో
సాలుతప్పక పొందవేసుకో ఇత్తనమ్ము ఇసి రిసిరి జల్లుకో
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నానీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా
పొలాలమ్ముకుని పోయేవారు టౌనును మేడలు కట్టేవారు
బ్యాంకుల డబ్బును దాచేవారు ఈ శక్తిని గమనిచరువారు
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నానీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా
పల్లెటూళ్ళలో చల్లనివారు పాలిటిక్సులోబ్రతికేవాళ్ళు
ప్రజాశక్తియని అరచేవారు.. ప్రజాశక్తియని అరచేవారు వళ్ళువంచి చాకిరికిమల్లరు
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నానీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా
పదవులు స్థిరమని భ్రమిసే వాళ్ళే వోట్లుగుంజి నిను మరచేవాళ్ళే
నీవేదిక్కని వక్కరు పదవోయ్.. నీవేదిక్కని వక్కరు పదవోయ్ రోజులుమారాయ్ రోజులుమారాయ్ మారాయ్ మారాయ్ మారాయ్ రోజులు మారాయ్
ఏరువాకా సాగారో రన్నో చిన్నన్నానీ కష్టమంతా తీరునురో రన్నో చిన్నన్నా

No comments:

Post a Comment