Friday, April 10, 2009

అంత్యాక్షరీ

ఎక్కడో చదివా - వాళ్లు మహమ్మద్ రఫి - కిషోర్ కుమార్ అంత్యాక్షరీ ఆడుతున్నారు. అంటే, ఓ రఫీ పాట - దాని అంత్యాక్షరంతో ఓ కిషోర్ పాట. మనమూ మొదలు పెడదామా?
ఓ ఘంటసాల పాట - అంత్యాక్షరంతో ఓ యస్.పి.బి పాట.
ప్రతీ పాటకీ తప్పనిసరిగా ఇవి ఉండాలి: పాడినవారు, ఏ చిత్రం, రాసింది ఎవరు, సంగీతం ఎవరు, మొట్టమొదటి చరణం (ఒకవేళ్ల పాటకి ముందు ఇంట్రో ఉంటే అంత్యాక్షరం దానితో మొదలుకావాలి).

తొందర్లో ఇక్కడ చేరిన పాటల ఆడియోలు సేకరించి అందిస్తా.

Tuesday, March 31, 2009

తెలుగులో రాయటం ఎలా?

చాలా తేలిక.
ఫైర్ఫాక్స్(3.0 కన్నా తక్కువ వెర్షన్ లో) వాడుకదారులకు ఇది -
Indic Input Extension కోసం ఇక్కడ నొక్కండి. ఈ పేజీ లోడ్ అయ్యాక, Add To FireFox నొక్కండి.
అది మీ ఫైర్ఫాక్స్ లో కుడిచేతి వైపు క్రింది మూల ఇలా ఓ ఒక చిన్న టూల్ ని జతచేరుస్తుంది.

దాని మీద మీటితే ఇన్పుట్ టైప్ ని మీకు కావాల్సిన భాషలోకి మారుస్తుంది. అలానే, ఆర్టియస్ లేక ఇన్స్క్రిప్ట్ ఇలా ఏవిధంగా మీకు అనవైతే ఆ విధంలోకి మారి టైప్ చేసుకోవచ్చు.
మళ్ళీ ఆంగ్లంలోకి తిరిగి చేరుకోవాలంటే డిఫాల్ట్ ఇనుట్ కి వస్తే సరి.

ఇంకో విధానం:- ఇది కిటికీ విస్తాలో సరిగ్గా పనిచెయ్యటంలేదు.
ఈ క్రింది టూల్ ని దింపుకోండి.
http://www.eemaata.com/unicode/rts2unicodeExt.html
ఇన్స్టాల్ చేస్కోండి.
ఇక, ఐ.ఈ లో ఏదైనా టెక్స్ట్ డబ్బాలో టైప్ చెయ్యండి, ఆ టెస్క్ట్ ని ఆసాంతం సెలెక్ట్ చేస్కుని మౌస్ రైట్ క్లిక్ నొక్కండి, మీకు "కన్వర్ట్ టూ ఆర్టీయస్" అని కనబడుతుంది, తెలుగులోకి మార్చండి...
ఆనందించండి..